జూ ఎన్టీఆర్ పై హత్యాయత్నం

0



murder-attempt-on-ntrప్రముఖ తెలుగు సినీ నటుడు జూ ఎన్టీఆర్ నివాసంలోకి ఓ అగంతకుడు తుపాకీతో చొరబడే ప్రయత్నం చేయడం, సెక్యూరిటీ అలర్ట్ కావడంతో పారిపోయిన సంఘటన తెలిసిందే. ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 37 చోటు చేసుకున్న ఈ సంఘటన ఆయన అభిమానులతో పాటు అందరినీ షాక్‌కు గురి చేసింది.
ఇది సాధారణ దొంగతనం ప్రయత్నం అని తేలిగ్గా తీసిపారేయడానికి వీల్లేని సంఘటన. అంగతకుడు తుపాకి చేత పట్టుకుని రావడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఆదివారం అందరూ దీపావళి పండగ మూడ్లో ఉన్న నేపథ్యంలో, సెక్యూరిటీ కూడా లూజ్ గా ఉంటుందనే భావనతోనే అగంతకుడు ప్లాన్ ప్రకారం జూ ఎన్టీఆర్ ఇంట్లోకి ప్రవేశించినట్లు స్పష్టం అవుతోంది. సదరు అగంతుకడు చేతిలో తుపాకి పట్టుకుని ఎందుకొచ్చాడు? ఎవరిని టార్గెట్ చేద్దామని? జూ ఎన్టీఆర్‌కు ఏమైనా హాని చేయాలనే ప్రయత్నమా? లేక మరేమైనా ఉద్దేశ్యమా? ఇలా అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ సంఘటన వెనక ఎవరి ప్రమేయమైనా ఉందా?….ఇలా అంతుచిక్కని సందేహాలెన్నో… ప్రస్తుతం జూ ఎన్టీఆర్ సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్నాడు. మరో వైపు ఆయనకు బలమైన రాజకీయ నేపథ్యం కూడా ఉంది. ఆయన రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ ఎప్పటి నుండో వినిపిస్తోంది. అదే సమయంలో ఆయన రాజకీయాల్లోకి రాకుండా బలమైన ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయనే ప్రచారం ఉంది. తాజాగా వెలుగు చూసిన సంఘటనలో కుట్ర కోణం స్పష్టం కనిపిస్తుందనేది అభిమానుల అభిప్రాయం. పారిపోయిన అగంతకుడిని పట్టుకుని ఈ సంఘట వెనక ఉన్న అసలు ఉద్దేశ్యాలు, నిజా నిజాలు తేల్చాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.