సవ్యసాచి – అమర్ అక్బర్ అఫీషియల్ డేట్లు

0తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న టాప్ ప్రొడక్షన్ హౌసుల్లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఒకటి. ‘రంగస్థలం’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మైత్రీ నుండి వచ్చే సినిమాలపై అందరిలోనూ ఆసక్తి మరింతగా పెరిగింది. మైత్రీ బ్యానర్ లో ప్రస్తుతం నాగ చైతన్య హీరో గా ‘సవ్యసాచి’ – రవితేజ హీరోగా ‘అమర్ అక్బర్ ఆంటోని’ తెరకెకెక్కుతున్నాయి. తాజాగా ఈ సినిమాల రిలీజ్ డేట్ల ను అధికారికంగా ప్రకటించింది మైత్రీ సంస్థ.

మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాను అక్టోబర్ 5 న రిలీజ్ చేస్తారట. ఈ సినిమా షూటింగ్ దాదాపు సగంపైగా కంప్లీట్ అయిందని సమాచారం. ఇలియానా డి క్రజ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విక్రంజిత్ – సాయాజీ షిండే – అభిమన్యు సింగ్ – తరుణ్ అరోరాలు ఇతర ముఖ్య పాత్రలలో కనిపిస్తారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకున్న ‘సవ్యసాచి’ నవంబర్ 2 న రిలీజ్ అవుతుందట. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది. R. మాధవన్ – భూమిక చావ్లా – వెన్నెల కిషోర్ – ముకుల్ దేవ్ లు ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు MM కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.