అనుపమపై రూమర్లకు మైత్రి మూవీస్ చెక్!

0anupama-parameswaran-picప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం రామ్ చరణ్ – సుకుమార్ లతో ఒక చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం స్టార్ రేస్ లో ముందున్న లక్కీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ను చరణ్ కు జోడీగా తీసుకున్నారని బలమైన వార్తలు వినిపించాయి. కానీ ఈ మధ్య అనుపమపరమేశ్వరన్ ను ఈ ప్రాజెక్టులో హీరోయిన్ గా తీసుకోవడంలేదని అందుకు కారణం ప్రస్తుతం ‘శతమానంభవతి’ పెద్ద హిట్ అవడం వలన ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందని, ఆ డిమాండ్ నచ్చకపోవడంతోనే ఆమెను ప్రాజెక్ట్ నుండి పక్కనబెట్టారని రకరకాల రూమర్లు వినిపించాయి.

దీంతో మైత్రీ మూవీస్ స్వయంగా రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ వివరణలో మైత్రీ మూవీస్ అనుపమ ఈ ప్రాజెక్టులో చేయడంలేదనేది వాస్తవం. కానీ రెమ్యునరేషన్ ఎక్కువ అడగడటం వలన ఆమె పక్కకు తప్పుకుందన్న వార్తలో ఏమాత్రం నిజం లేదు. అనుపమ మంచి టాలెంట్ ఉన్న నటి. ఆమె మా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో ఖచ్చితంగా పనిచేసే అవకాశముంది అని తెలిపారు. దీంతో కొన్ని రోజులుగా అనుపమ పై వస్తున్న రూమర్లకు చెక్ పడింది.