బాప్ రే.. రెండు సీన్లకే 8 కోట్లు

0

మైత్రి మూవీ మేకర్స్ డేరింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీ రైజింగ్ స్టార్స్.. ప్రామిస్సింగ్ స్టార్స్ ని వెతికి మంచి కథల్ని ఎంచుకుని వారి కోసం ఎంత బడ్జెట్లు పెట్టేందుకైనా సదరు సంస్థ వెనకాడడం లేదు. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని హీరోగా విక్రమ్.కె.కుమార్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఏకంగా 40-50 కోట్ల మేర బడ్జెట్ పెడుతోందని సమాచారం. దీంతో పాటే విజయ్ దేవరకొండ హీరోగా డియర్ కామ్రేడ్ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ సినిమా త్వరలో రిలీజ్ కి రానుంది.

ఈ సినిమా రిలీజ్ కాకముందే విజయ్ దేవరకొండ హీరోగా మైత్రి సంస్థ మరో భారీ చిత్రాన్ని ప్రారంభిస్తోంది. ఈ సినిమా కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్. అలాగే కాన్వాసు పెద్దదేనని చెబుతున్నారు. తమిళ దర్శకుడు ఆనంద్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. ఈ ఆదివారం సినిమా ప్రారంభం కానుంది. అటుపై ఈనెల 22 నుంచి భారీ షెడ్యూల్ తెరకెక్కనుందని తెలుస్తోంది. దిల్లీలో చిత్రీకరణ ఎంతో కీలకంగా ఉండబోతోందిట.

బైక్ రేసింగ్ నేపథ్యం లో ఆద్యంతం రక్తి కట్టించే స్క్రీన్ ప్లేతో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. ఇందులో విజయ్ బైక్ రేసర్ గా ప్రయోగాత్మక పాత్రలో నటిస్తున్నారు. రేసర్ .. సాహసాలు అంటే మామూలుగా కాదు. ఇందులో కేవలం రెండే రెండు సీన్లకే దాదాపు ఎనిమిది కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. అందుకోసం ఫారిన్ నుంచి బైక్ రేసర్లు.. డ్రోన్ లు.. స్కార్పియో ఎక్విప్ మెంట్ సహా వాటన్నిటినీ ఆపరేట్ చేసే ట్రైనింగ్ ఉన్న వాళ్లను బరిలో దించుతున్నారట. పైగా రేస్ ట్రాక్ అనుమతుల కోసమే కోటి వెచ్చిస్తున్నారని తెలుస్తోంది. అందుకే ఇంత భారీగా ఖర్చవుతోందని తెలుస్తోంది.

ఇక దేవరకొండ ఇప్పటికే క్రాంతి మాధవ్ – కేఎస్.రామారావు కాంబినేషన్ సినిమాని పూర్తి చేస్తూనే .. మైత్రి సంస్థ తాజా చిత్రాన్ని పూర్తి చేస్తారట. ఇకపోతే దేవరకొండను నమ్మి ఏకంగా రూ.30 – 50కోట్ల బడ్జెట్ ని వెచ్చించేందుకు మైత్రి సంస్థ సాహసం చేయడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇకపోతే ఇటీవలే అగ్ర హీరోలు.. అగ్ర దర్శకులతో సినిమాలు చేయడం కష్టమని భావించిన మైత్రి ఇలా నవతరం ట్యాలెంటునే నమ్మి ఇంత పెట్టుబడులు పెడుతోందని అర్థమవుతోంది. కథ..కంటెంట్ నచ్చితే బ్లాక్ బస్టర్లతో వంద కోట్లు లాగేస్తున్నారు యూత్. అందుకే డేరింగ్ మిషన్ తో మైత్రి సంస్థ ముందుకు వెళుతోందన్నమాట.