రంగస్థలం ధమాకా..సుక్కుకి మళ్ళీ 7 కోట్లు

0తెలుగు సినిమాలు చాలానే రిలీజ్ అవుతుంటాయిగానీ వాటిలో సక్సెస్ అయ్యేవి కొన్నే. వాటిలో నిర్మాతలకు నిజంగా లాభాలు తెచ్చివి సగం కూడా ఉండవు. కరెక్ట్ గా చెప్తే ఏడాది మొత్తం రిలీజ్ అయిన సినిమాల్లో నిర్మాతలు – బయ్యర్లు – డిస్ట్రిబ్యూటర్లందరూ నిజంగా లాభాలు కళ్ళజూసిన సినిమాల సంఖ్యను మనం వేళ్ళ మీద లెక్కపెట్టచ్చు. మరి ఇలాంటి పరిస్థితులున్న ఇండస్ట్రీలో ‘రంగస్థలం’ లాంటి సినిమా విజయం ఎప్పుడూ ప్రత్యేకమైనదే.

విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా ప్రేక్షకులను కూడా మెప్పించి బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ సృష్టించడం అంటే అదేమీ సాధారణమైన విషయం కాదు. ‘రంగస్థలం’ సక్సెస్ తో నిర్మాతలు ఫుల్లుగా ఖుష్ అయ్యారు. చరణ్ లాంటి పెద్ద స్టార్ తో ఈ సినిమా ఒక ఎక్స్ పరిమెంట్ అనే చెప్పాలి. కానీ వాళ్ళు డైరెక్టర్ సుకుమార్ విజన్ కు ఫుల్ సపోర్ట్ ఇవ్వడంతో ‘రంగస్థలం’ లాంటి సినిమా బయటకు వచ్చింది.. బ్లాక్ బస్టర్ అయింది. సుకుమార్ వర్క్ తో ఇంప్రెస్ అయిన మైత్రివారు ఇప్పటికే సుక్కును మరోసారి మహేష్ సినిమాకు లాక్ చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు మైత్రి వారు ‘రంగస్థలం’ సినిమాను సూపర్ హిట్ చేసినందుకు సుకుమార్ కు రెమ్యునరేషన్ కాకుండా మరో 7 కోట్ల రూపాయలను అదనంగా ఇచ్చారట. టాలీవుడ్ లో ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి. చూస్తుంటే మైత్రి బ్యానర్ సుక్కుతో ఓ లాంగ్ టర్మ్ రిలేషన్ ఆశిస్తున్నట్టుగా ఉంది. మంచిదే కదా.. సుక్కు కి మైత్రి వారికి ఇది విన్-విన్ సిచుయేషన్.