ఇల్లీ బేబీ నీకు స్వాగతం

0ఒకప్పటి టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఇలియానా తెలుగు సినిమా చేసేందుకు తిరిగొచ్చింది. దేవదాసు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ గోవా సుందరి పోకిరి సినిమాతో కుర్రాళ్ల గుండెలని కొల్లగొట్టేసింది. దీంతో చాలా తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్ లోని యూత్ హీరోలందరి పక్కన ఆడిపాడింది.

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన జులాయి సినిమాలో చివరగా ఇలియానా నటించింది. ఆ తరవాత పెట్టేబేడా సర్దుకుని ముంబయి వెళ్లిపోయి అక్కడే ఉండిపోయింది. ఏదో అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ వస్తున్నా ఇలియానాకు అక్కడ స్టార్ హీరోయిన్ ఇమేజ్ రాలేదు. దీంతో మంచి కమ్ బ్యాక్ మూవీ కో్సం ఎదురుచూస్తున్న ఇల్లీ బేబీ రవితేజ హీరోగా నటిస్తున్న అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటించేందుకు ఒప్పుకుంది. ఆమె తిరిగి సెట్లోకి అడుగుపెడుతున్న సందర్భంగా మైత్రీ మూవీమేకర్స్ ట్విట్టర్ పేజీలో ఆమెకు సాదర స్వాగతం పలికింది.

‘‘ఇలియానా.. నువ్వు తిరిగి తెలుగు సినిమాకు రావడం ఆనందంగా ఉంది’’ అంటూ టీం అమర్ అక్బర్ ఆంటోని పేరిట ఓ ఫొటో పేస్ట్ చేశారు. శ్రీను వైట్ల డైరెక్షన్ లో వస్తున్న ఈమూవీలో మాస్ మహారాజా రవితేజ మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం యూనిట్ మొత్తం యూఎస్ కు బయలుదేరి వెళ్తోంది.