నా పేరు సూర్య ఫస్ట్ డే రికార్డు బ్రేక్ చేస్తుందా..?

02018 లో తెలుగులో ఇప్పటివరకు చాల సినిమాలే రిలీజ్ అయినప్పటికీ , అసలైన సినిమా పండగను తీసుకొచ్చిన సినిమాలు మాత్రం రంగస్థలం , భరత్ అనే నేను అనే చెప్పాలి. ఈ రెండు సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామి నడుస్తుంది. ఇక రేపు అల్లు అర్జున్ నా పేరు సూర్య అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

దేశ భక్తి నేపథ్యం లో స్టార్ రైటర్ వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఇప్పటికే ట్రైలర్ తో ఎంతగానో ఆకట్టుకోవడం తో ఫస్ట్ డే రికార్డు ఫై అందరి దృష్టి పడింది. మెగా అభిమానులైతే గత చిత్రాల ఫస్ట్ డే కలెక్షన్ల రికార్డు ను బ్రేక్ చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఆ రేంజ్ కలెక్షన్లు రాకపోవచ్చు , సినిమా కంటెంట్ దేశ భక్తి నేపథ్యం కాబట్టి సినిమా టాక్ బట్టి జనాలు థియేటర్స్ కు వెళ్తారు తప్ప ముందుగా మాత్రం వెళ్లారని అంటున్నారు. ఏది ఏమైనప్పటికి సూర్య ఫస్ట్ డే కలెక్షన్ల ఫై అందరి దృష్టి పడింది.