ఈ రోజు అల్లు అర్జున్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ లోని కొత్త టీజర్ ని వదిలారు. డైలాగ్ టీజర్ ఇది. రేయ్ సౌత్ ఇండియాకా సాలా.. అని అల్లు అర్జున్ ని ఎవరో అంటే.. ఒక్క పంచ్ ఇచ్చి సౌత్ ఇండియా, నార్త్ ఇండియా.. ఈస్ట్, వెస్ట్ ఇన్ని ఇండియాలు లేవురా మనకి. వున్నది ఒక్కటే ఇండియా” అని అల్లు అర్జున్ చెప్పడం ఆకట్టుకుంది. ఈ డైలాగ్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.
ఈ సినిమా అను ఇమ్మాన్యుయేల్ కథానాయిక. వక్కంతం వంశీ దర్శకుడు. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై శిరీష శ్రీధర్ సినిమాను నిర్మిస్తున్నారు. బన్నీ వాసు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మే 4న సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.