‘నా పేరు సూర్య’.. అప్పుడే రూ. 85.87 కోట్లు

0క్రేజీ స్టార్ సినిమాకి వున్న క్రేజ్ ఎలాంటిదో మరోసారి రుజువైయింది. విడుదలకు ముందే రూ. 85.87 కోట్లు బిజినెస్ తో అదరగొట్టాడు బన్నీ. అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘నా పేరు సూర్య. నా ఇల్లు ఇండియా’. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా ‘ రిలీజ్ కు ముందే రూ. 85 కోట్లు రాబట్టింది. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను పీఆర్వో వంశీ శేఖర్ తన ట్విట్టర్ లో వెల్లడించారు. ఈ సినిమాకు నైజాంలో రూ. 21 కోట్లు, విశాఖలో రూ. 8 కోట్లు, సీడెడ్ లో రూ. 12 కోట్లు, యూఎస్ లో రూ. 7 కోట్లు, మిగతా దేశాల్లో రూ. 2 కోట్లు, కేరళలో రూ. 3 కోట్లు, బెంగళూరులో రూ. 9 కోట్లు, గుంటూరులో రూ. 5.5 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ. 4.2 కోట్లు, తూర్పు గోదావరిలో రూ. 5.4 కోట్లు, నెల్లూరులో రూ. 2.52 కోట్లు, కృష్ణాలో రూ. 5 కోట్ల వ్యాపారం జరిగిందని వెల్లడించారు. మొత్తం రూ. 85.87 కోట్ల బిజినెస్ జరిగిందని వెల్లడించారు.