హీరోలు అందరి మీదా సెటైరే!!

0కోలీవుడ్ లో ఎమోషనల్ అండ్ కామెడీ సన్నివేశాలకు మంచి ఆదరణ ఉంటుంది. కొన్నేళ్ల క్రితం వచ్చిన కామెడి సినిమా తమిళ్పడం కోలీవుడ్ లో సంచలన విజయం అందుకుంది. కామెడీ సినిమాలకే కొత్త అర్ధాన్ని చెప్పినా సినిమాగా మంచి గుర్తింపు అందుకుంది. స్పూఫ్ అనే దానికి అసలైన అర్ధాన్ని చూపించి ప్రేక్షకులకు అసలైన కామెడీ రుచిని చూపించింది. ప్రముఖ సినిమాల్లోని పాటలను డైలాగులను ఎంతగానో స్పూఫ్ చేశారు.

ఆ కాన్సెప్ట్ పై తో తెలుగులో అల్లరి నరేష్ సుడిగాడు అంటూ రీమేక్ తో హిట్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. అయితే తమిళ్పడం కు సీక్వెల్ ను ప్రస్తుతం రూపొందిస్తున్నారు. మొదట తమిళ్పడం 2.0 అని టైటిల్ సెట్ చేశారు. కానీ ఇప్పుడు 0 తీసేసి 2 అని మాత్రమే ఉంచారు. ఇక సినిమా ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ డిఫరెంట్ గా స్టార్ట్ చేసింది. సినిమాలోని ఒక పాటని ఇటీవల రిలీజ్ చేశారు. రజినీకాంత్ నుంచి శివ కార్తికేయన్ వరకు అందరి హీరోలకు సంబంధించిన సినిమాలపై సెటైర్ వేసే విధంగా ఆ పాటను రూపొందించారు.

అలాగే రాజకీయాలకు సంబంధించిన విషయాలను కూడా సినిమాల్లో చూపించనున్నారు అని మొదట పోస్టర్ ద్వారానే చెప్పేశారు. ఇక ఇప్పుడు స్టార్ హిర్లోలపై సెటైర్లు వేయడం సోషల్ మిడియలో వైరల్ గా మారింది. కబాలి లో నెరుప్పుడా (నిప్పురా).. అనే వర్డ్ ను పరుప్పుడా.. అని ఉండడంతో సూపర్ స్టార్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నారు. సీఎస్ అముదన్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా ముందు ముందు ఎలాంటి కాంట్రవర్షియల్స్ ను సృష్టిస్తుందో చూడాలి.