హీరోను టార్చర్ పెడుతున్న అనుపమ

0ప్రేమ అనే పదానికి ఒక్కొక్కరు ఒక్కో రకమైన అర్ధం ఇస్తూ ఉంటారు. ఆ భావాన్ని అనుభవించే వాళ్లు అయితే.. రకరకాల ఫీలింగులతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మిగిలిన హీరోలతో పోల్చితే సుప్రీం హీరో సాయి ధరం తేజ్.. ఆ ప్రేమలో మునిగి తేలుతున్నట్లుగా కనిపిస్తోంది. సహజంగానే కరుణాకరన్ సినిమాలు అంటే ప్రేమలో కొత్త వేరియేషన్స్ చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు తేజు కోసం బోలెడన్ని ఫీలింగ్స్ ను మిళితం చేసినట్లుగా ఉన్నాడు ఈ దర్శకుడు.

జూలై 6న తేజ్ ఐ లవ్యూ మూవీని రిలీజ్ చేయాలని నిర్ణయించగా.. ఇప్పుడు ప్రమోషన్స్ తో ఫుల్లు బిజీగా ఉంది యూనిట్. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు జనాలను బాగానే మెప్పిస్తున్నాయి. తాజాగా వీడియో ప్రోమోలతో కూడా జనాలను ఊరించే పనిలో పడ్డాడు హీరో. ‘నచ్చుతున్నాదే’ అంటూ సాగే పాటకు ప్రోమోను విడుదల చేయగా.. విజువల్స్ పరంగా అద్భుతంగా ఉంది ఈ సాంగ్. హీరో తేజును.. హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్.. ఉదయాన్నే ఎలా వేధించడం మొదలుపెట్టింది.. ఆమెతో హీరో ఎన్ని తిప్పలను ప్రేమగా పడుతున్నాడు.. వంటి సన్నివేశాలను బాగానే కూర్చారు.

హీరోయిన్ ను రకరకాల గెటప్పులలో చూపించిన విధానం సూపర్బ్ గా ఉండగా.. తనను అనుపమా పరమేశ్వరన్ ఎంతగా టార్చర్ పెడుతోందో ఈ పాటలో చూడమంటూ కామెడీ చేస్తున్నాడు సాయిధరం తేజ్. అంతా బాగానే ఉంది కానీ.. నచ్చుతున్నాదే అంటూ టైటిల్ పెట్టిన ఆ సాంగ్ ప్రోమోలో.. అసలు ఆ పదమే వినిపించకుండా కట్ చేయడం మాత్రం కాస్త కామెడీగానే ఉంది.