ఎన్టీఆర్ తప్ప ఎవ్వరినీ ఊహించలేను

0ఎట్టకేలకు సావిత్రి బయోపిక్ మహానటి మరొక రోజు ఆగితే ప్రేక్షకుల ముందుకు రానుంది. బుధవారం రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం చాలా మంది ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ నటులు పాత్రలకు ప్రస్తుతం నటీనటులు ఎలా నటించారు అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా కొన్ని పాత్రల వల్ల సినిమాపై అంచనాలు చాలానే పెరిగాయి. సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఆయన మనవడు నాగ చైతన్య కనిపించనున్న సంగతి తెలిసిందే.

అయితే సీనియర్ నటులు ఎన్టీఆర్ కూడా సావిత్రి తో ఎన్నో సినిమాలు చేశారు. మరి ఆయన పాత్రలో కనిపించే యాక్టర్ ఎవరనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ముందుగా ఎన్టీఆర్ పాత్రకోసం కథ అనుకున్నప్పుడే తారక్ ను అడిగారు. కానీ ఎందువల్లనో గాని తన తాత పాత్రను చేయడానికి తారక్ ఒప్పుకోలేదు. దర్శకుడు నాగ్ అశ్విన్ మరే నటుడిని ఆ పాత్రలో ఊహించుకోవడానికి వీలుపడక జూనియర్ ఎన్టీఆర్ నే అడిగినప్పటికి వర్కౌట్ కాలేదు.

అయితే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ పాత్రలో మరెవరిని చూడబోతున్నాం అన్న విషయంపై దర్శకుడు స్పందిస్తూ.. ముందు తారక్ ని తప్ప ఎవరిని నేను ఉహించుకోలేదు. అయితే ఇప్పుడు అభిమానులకు నచ్చేలా మా వరకు ప్రయత్నం చేసి ఏదో చేసాం. డిజిటల్ అనుకోండి. లేక మరేదైనా అనుకోండి. మొత్తానికి అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాం. ఏదేమైనా అంతా సినిమా విడుదలయిన తరువాతే మీకే తెలుస్తుందని నాగ్ అశ్విన్ వివరించాడు.