గోల్ఫ్ ఆడుతున్న నవమన్మథుడు

0

ఫిట్నెస్ విషయమే తీసుకుంటే టాలీవుడ్ లో అక్కినేని నాగార్జునకు సరితూగగల మరో హీరో కనిపించరు. అరవై ఏళ్ళ వయసులో ఇంకా ముప్పై ఏళ్ళ వ్యక్తిగా కనిపించే ఆయన లుక్స్ కు ఎవరూ పోటీ ఇవ్వలేరు. రీసెంట్ గా ‘మన్మథుడు 2’ షూటింగ్ సమయంలో తీసిన ఫోటోనే దానికి ప్రూఫ్.

స్కై బ్లూ కలర్ టీ షర్ట్.. చెక్స్ ఉండే లైట్ కలర్ ప్యాంట్.. స్పోర్ట్స్ షూ ధరించిన నాగ్ కళ్ళకు గాగుల్స్.. ఒక చేతికి వైట్ కలర్ గ్లవ్ ధరించాడు. ఎడమ చేత్తో గోల్డ్ స్టిక్ ను పట్టుకొని సూపర్ స్టైలిష్ గా నడుస్తున్నాడు. గోల్డ్ ప్లేయర్స్ ఎలా ఉంటారో అంతే ఫిట్ గా.. స్టైలిష్ గా కనిపించడం నాగ్ కు మాత్రమే సాధ్యం. ఈమధ్యే ‘మన్మథుడు 2’ టీమ్ పోర్చుగల్ లో ఒక లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకొని వచ్చారు. పోర్చుగల్ షెడ్యూల్ తో దాదాపు గా 80 % పూర్తయిందని సమాచారం

త్వరలోనే ‘మన్మథుడు 2’ కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం అవుతుందట. ‘చిలసౌ’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రంలో నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో కన్నడ బ్యూటీ అక్షర గౌడ మరో కీలక పాత్రలో నటిస్తోంది.
Please Read Disclaimer