ఎన్టీఆర్ లో మెగా బ్రదర్?

0నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాణం క్రిష్ దర్శకత్వంలో శరవేగంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. హరికృష్ణ అకాల మరణం తర్వాత చిన్న బ్రేక్ వచ్చినప్పటికీ ఈ రోజు నుంచి కంటిన్యూ చేయబోతున్నారు. సంక్రాంతికి విడుదల టార్గెట్ ఉంది కాబట్టి బ్రేక్ వేయడానికి లేదు. మహానటి తర్వాత అంత క్రేజ్ తో రూపొందుతున్న బయోపిక్ కాబట్టి ఆర్టిస్టుల విషయంలో క్రిష్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే కైకాల సత్యనారాయణ లాంటి అనుభవజ్ఞులను సైతం మెప్పించిన క్రిష్ తాజాగా ఎస్వి రంగారావు పాత్ర కోసం మెగా బ్రదర్ నాగబాబు కలిశాడట.మహానటిలో మోహన్ బాబు చేసేసారు కాబట్టి ప్రేక్షకులకు అది తలుపుకు రాకుండా నాగబాబును సెట్ చేసుకున్నట్టు తెలిసింది. ఎస్విఆర్ లాంటి నిండైన విగ్రహానికి నాగబాబు బాగా సూట్ అవుతాడు. అందులో అనుమానం లేదు. కాకపోతే ఈ మధ్య విపరీతమైన గొంతు నెప్పితో బాధ పడుతూ సరిగా మాట్లాడలేకపోతున్న నాగబాబు డబ్బింగ్ విషయంలో మరోసారి రాజీ పడతాడా అనేది అనుమానమే. దానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఆ లోగా కోలుకుంటే మంచిదే.

ఇక మరో అప్ డేట్ ప్రకారం ఎన్టీఆర్ మొదటిసారి టిడిపి అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో మాట్లాడే సన్నివేశాలు ఈ రోజు నుంచి షూట్ చేయబోతున్నట్టు తెలిసింది. ఆహార్యం విషయంలో ఉన్న చిన్నపాటి అనుమానాలను ఆ మధ్య విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో పూర్తిగా తుడి చేసిన క్రిష్ టీమ్ ఇప్పుడు బాలయ్యను ముఖ్యమంత్రి గెటప్ లో చూస్తే అభిమానులకు కన్నుల పండుగే అంటున్నారు. ఇదే షెడ్యూల్ లో నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్న రానా కూడా ఉంటాడని తెలిసింది. ఒక్కొక్కరుగా తోడవుతున్న ఎన్టీఆర్ స్టార్ కాస్ట్ చూస్తుంటే మల్టీ స్టారర్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉండేలా కనిపిస్తోంది. ఈ షెడ్యూల్ అవ్వగానే పాటల చిత్రీకరణ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. డ్యూయెట్స్ ఉండే అవకాశాలు లేవు కానీ అలనాటి ఎన్టీఆర్ సూపర్ హిట్ సాంగ్ బిట్స్ కు బాలయ్య వేసే స్టెప్స్ బాగా ప్లాన్ చేసాడట క్రిష్. మెగా బ్రదర్ రాక దాదాపు ఖరారైనట్టే. ఒకపక్క అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవలో నటిస్తూనే మరోవైపు బాబాయ్ ఎన్టీఆర్ లో ఛాన్స్ కొట్టేసిన నాగబాబు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు.