సిల్లీ పుకార్లపై నాగబాబు స్పందించాడేంటో?

0

మెగా బ్రదర్ నాగబాబు ఈమద్య సోషల్ మీడియాలో తెగ కనిపిస్తున్నాడు. బాలకృష్ణ ఎవరో తెలియదు అన్నప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి రోజు ఏదో ఒక విషయంతో మీడియాలో ఉంటూనే ఉన్నాడు. ముఖ్యంగా నాగబాబు విషయం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కామెంట్స్ పొలిటికల్ పంచ్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమయంలోనే వరుణ్ తేజ్ జనసేన పార్టీకి విరాళం ఇవ్వడం పట్ల ఒక సిల్లీ పుకారు పుట్టుకు వచ్చింది.

ఆ సిల్లీ పుకారు ఏంటీ అంటే… వరుణ్ తేజ్ జనసేన పార్టీకి విరాళం ఇవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ అభిమానులను దోచుకున్నాడు. మెగా ఫ్యాన్స్ లో కొందరు పవన్ కు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు వారు పవన్ సినిమాలకు దూరం అవ్వడంతో చరణ్ వైపు మొగ్గు చూపుతున్నారు. వారిని తనవైపుకు తిప్పుకునేందుకు వరుణ్ ఇలాంటి ప్లాన్ చేశాడు అంటూ కొందరు కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. ఈ కామెంట్స్ సిల్లీగా అనిపించినా కూడా సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి.

నాగబాబుపై తన కొడుకు వరుణ్ పై సోషల్ మీడియాలో రోజు ఏదో ఒక సిల్లీ పుకారు వస్తూనే ఉంటుంది. కాని ఈసిల్లీ పుకారుకు మాత్రం నాగబాబు స్పందించడం విచిత్రంగా ఉంది. పైగా వరుణ్ తేజ్ చరణ్ లు నేను అన్నయ్య ఎలా ఉంటామో అలా ఉంటారు నిహారికను చరణ్ సొంత చెల్లిలా చూసుకుంటాడు. ఇలాంటి పుకార్లు ఎందుకు పుట్టిస్తున్నారు అంటూ నాగబాబు ఫైర్ అయ్యాడు.

సోషల్ మీడియాలో తనపై వచ్చే కామెంట్స్ ను నేనెప్పుడు పట్టించుకోలేదు అంటూ ఆమద్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన నాగబాబు ఈ సిల్లీ పుకార్లపై ఎందుకు స్పందించాడో అంటూ సరికొత్త అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer