మారుతి దర్శకత్వంలో నాగ చైతన్య!

0Naga-chaiatanya-to-work-with-maruthiచిన్న సినిమాలతో ట్రెండ్ సృష్టించిన దర్శకుడు మారుతి. ఆయన చేసిన ‘బస్టాప్, ఈ రోజుల్లో’ సినిమాలు చిన్న సినిమాలుగా వచ్చి పెద్ద విజయాలను అందుకున్నాయి. ఆ తర్వాత నానితో ‘భలే భలే మగాడివోయ్’ తీసి భారీ బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. అలాగే సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తో ‘బాబు బంగారం’ చేసి పర్వలేదనిపించుకున్నారు. ప్రస్తుతం శర్వానంద్ తో ఆయన చేస్తున్న ‘మహానుభావుడు’ షూటింగ్ దశలో ఉంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తర్వాత అక్కినేని నాగచైతన్యతో ఒక సినిమా చేసే యోచనలో ఉన్నాడట మారుతి. ప్రస్తుతం ‘యుద్ధం శరణం విడుదల’ కోసం ఎదురుచూస్తున్న చైతు తర్వాత పెళ్లి కోసం కాస్త బ్రేక్ తీసుకోకున్నాడు. ఆ బ్రేక్ తర్వాత మారుతి సినిమా ఉండొచ్చని ఫిల్మ్ నగర్ టాక్. ‘బాబు బంగారం, ప్రేమమ్’ వంటి సినిమాలను నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తారట. త్వరలోనే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వుంది.