ఆ ఇద్దరి ‘మజిలీ’ చివరి ఫోటో…అదిరిందిగా

0

షూటింగ్ పూర్తి అయిపోయింది…చివరి క్ల్యాప్ కొట్టేసారు…సినిమా షూట్ చేసిన కేమేరా స్విచ్ ఆఫ్ చేశారు…మరో కేమేరా ఆన్ చేసి ఫోటో క్లిక్ చేశారు…ఇంతకీ ఏంటి ఇదంతా అంటారా….అక్కడే ఉంది అసలు విషయం. మ్యాటర్ ఏంటి అంటే ‘మజిలీ’ శివ నిర్వాన దర్శకత్వంలో అక్కినేని చైతన్య…సమంతా కలసి నటిస్తున సినిమా..ఈ సినిమాపై అటు అక్కినేని అభిమానుల్లో – ఇటు సమంత ఫాన్స్ లో భారే అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ త్వరలో స్టార్ చెయ్యనున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ శుభం షాట్ కి టీమ్ మొత్తం ఒక ఫోటో తీసుకున్నారు..ఆ ఫోటోదే ఈ మ్యాటర్ అంతా.

ఆ ఫోటోని అటు చైతు – ఇటు సమంత ఇద్దరూ తమ ట్విట్టర్ ద్వారా అభిమానులకు పంచుకున్నారు. ఇక ఈ ఫోటోలో చైతు కొత్త ట్రెండ్ కి తగ్గట్టు కనిపించగా…సమంత మాత్రం యధావిధిగా…చాలా సింపుల్ గా చూడీదార్ లో కనిపించింది. ఇక సినిమా విషయానికే వస్తే షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా ఒక రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఇప్పటికే డిసెంబర్ 31 – 2018 నాడు విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్ – ఆ తర్వాత మకర సంక్రాంతికి విడుదల చేసిన మరో లుక్ – ప్రేమికుల రోజు సంధర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన టీజర్ అన్నీ మంచి రెస్పాన్స్ అందుకుని ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి.

ఇక ఈ టీజర్ అయితే ఇప్పటికే 7.5 మిలియన్ వ్యూస్ తో చైతు కరియర్ లోనే ఒక రికార్డు అని చెప్పవచ్చు. ఇప్పటికే ఏం మాయ చేశావే…మనం…ఆటో నగర్ సూర్య సినిమాల్లో కలిసి నటించిన ఈ సమంత అండ్ చైతూ – మరో మారు తెరపై కలసి కనిపించనున్నారు. అయితే పెళ్లి అయ్యాక మాత్రం ఇద్దరూ కలసి నటించడం ఇదే మొదటి సినిమాగా చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో చైతు క్రికెట్ ప్లేయర్ గా కనిపించనున్నాడు. త్వరలోనే గోపి సుందర్ స్వరపరిచిన పాటలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి….ఏప్రిల్ 5న గ్రాండ్ రిలీజ్ చెయ్యనున్నారు..మరి ఈ ఇద్దరి కలయిక ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూద్దాం.
Please Read Disclaimer