అంగరంగవైభవంగా జరిగిన చైతూ- సమంతల వివాహం…

0Naga-Chaitanya-and-Samanthaటాలీవుడ్ అందాల ప్రేమజంట ఒక్కటైంది. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, ఆత్మీయుల ఆనందోత్సాహాల నడుమ నాగచైతన్య, సమంతల వివాహం గోవాలోని వెగాటర్ బీచ్ లోని డబ్ల్యూ హోటల్ లో అంగరంగవైభవంగా జరిగింది. నాగచైతన్య, సమంత సినీ నటులు కావడానికి తోడు చైతన్య తండ్రి అక్కినేని నాగార్జున, తల్లి దగ్గుబాటి లక్ష్మి ఇద్దరూ టాలీవుడ్ అగ్ర కుటుంబాలకు చెందినవారు కావడంతో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, బంధువులు, అత్యంత సన్నిహితులు ఈ వివాహవేడుకకు హాజరయ్యారు.

వందమంది అతిథుల సమక్షంలో సమంత మెడలో నాగచైతన్య మూడుముళ్లు వేశాడు. సరిగ్గా రాత్రి 11:52 నిమిషాలకు వివాహం జరిగింది. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలను నాగార్జున తన ట్విట్టర్ ఖాతాలో పెట్టారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నవ దంపతులు నాగచైతన్య, సమంతలపై అభిమానులు అభినందనలు, శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. ఆ ఫొటోలు మీరు కూడా చూడండి.