చైతు చాలా తెలివిగా పెంచేశాడు

0

గత రెండేళ్ళలో నాగ చైతన్య గట్టిగా చెప్పుకునే హిట్టు ఒక్కటీ లేక అభిమానులు చాలా ఇబ్బందిగా ఫీలయ్యారు. ఏ జానర్ ట్రై చేసినా అన్నింటిలో ఒకే ఫలితం దక్కడం ఒకరకంగా చైతుని అయోమయంలో పడేసింది. మాస్ ఫార్ములాతో శైలజారెడ్డి అల్లుడు డిఫరెంట్ పాయింట్ తో సవ్యసాచి టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో యుద్ధం శరణం ఇలా దేనికవే సంబంధం లేనివి అయినప్పటికీ ఫలితాలు మాత్రం మారలేదు.

వీటికి పూర్తిగా చెక్ పెడుతూ మజిలీ ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడంతో చైతు ఆనందం మాములుగా లేదు. దానిలో భార్య సమంతా కీలక పాత్ర కావడం కన్నా కావాల్సింది ఏముంటుంది. సరే దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకునే తరహలో సరైన సమయంలో చైతు రెమ్యునరేషన్ పెంచినట్టు టాక్

ఇప్పటిదాకా తీసుకుంటున్న మొత్తానికి మరో కోటి అదనంగా డిమాండ్ చేస్తున్నాడట. ఎలాగూ మజిలీ 35 కోట్ల దాకా రాబడుతూ స్టామినా చాటింది. సో మార్కెట్ ఆటోమేటిక్ గా పెరిగినట్టే. సరైన సబ్జెక్టుతో చూపిస్తే చైతు బాగానే రాబడతాడని ప్రూవ్ అయ్యింది. ఇంకో కోటి ఎక్స్ట్రా అడగటం పెద్ద విషయమేమీ కాదు. ప్రస్తుతం వెంకీ మామ షూటింగ్ లో ఉన్న చైతు అది కాకుండా మరో రెండు ఒప్పుకున్నాడు.

ఒకటి దిల్ రాజు నిర్మాణంలో రూపొందే లవ్ స్టొరీ కాగా మరొకటి ఆరేక్స్ 100 ఫేం అజయ్ భూపతి తీయబోయే మహాసముద్రం. దీంట్లో సమంతానే నటించే అవకాశాలు ఉన్నాయంటూ ఇప్పటికే టాక్ ఉంది. మొత్తానికి ఎన్నాళ్ళో వేచిన ఉదయం చైతుకు మజిలి రూపంలో కలిసొచ్చింది
Please Read Disclaimer