పెళ్లికి ముందే చందూతో చైతూ సినిమా

0Chandoo-Mondeti-Before-his-‘ప్రేమమ్’ సినిమాకు ముందు వరకు నాగచైతన్య కెరీర్ స్లంప్ లో కనిపించింది. ‘దోచేయ్’ ఫ్లాపవడంతో ఏడాదిన్నరకు పైగా చైతూ సినిమా ఏదీ విడుదల కాలేదు. ‘ప్రేమమ్’ కూడా లేటుగా మొదలై.. అనుకున్న దాని కంటే కొంచెం ఆలస్యంగానే విడుదలైంది. కానీ ఈ చిత్రం విజయవంతం కావడంతో చైతూలో ఉత్సాహం వచ్చింది. వరుస బెట్టి సినిమాలు కమిటయ్యాడు. చకచకా ఒక్కోటి పూర్తి చేసి రిలీజ్ కు రెడీ చేసేస్తున్నాడు. ‘ప్రేమమ్’ వచ్చిన ఎనిమిది నెలల్లోపే ‘రారండోయ్ వేడుక చూద్దాం’ను రిలీజ్ కు రెడీ చేశాడు. ఈ సినిమా కూడా విజయవంతం కావడంతో ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలోనూ వేగం చూపిస్తున్నాడు చైతూ.

కృష్ణ అనే కొత్త దర్శకుడితో చైతూ చేస్తున్న థ్రిల్లర్ మూవీ ముగింపు దశలో ఉండగా.. దీని తర్వాత ‘ప్రేమమ్’ దర్శకుడు చందూతో చేయాల్సిన కొత్త సినిమాను కూడా వెంటనే మొదలుపెట్టేయబోతున్నాడు చైతూ. అక్టోబర్లో సమంతతో పెళ్లి నేపథ్యంలో ఇక ఈ ఏడాదంతా చైతూ కొత్త సినిమా జోలికి వెళ్లడనే అనుకున్నారంతా. కానీ చైతూతో తన కొత్త సినిమాను అతడి పెళ్లి లోపే మొదలుపెట్టబోతున్నట్లుగా చందూ మొండేటి వెల్లడించాడు. ఓ ఇంగ్లిష్ డైలీతో మాట్లాడుతూ.. చైతూ సినిమాను కన్ఫమ్ చేశాడు చందూ. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చందూ తెలిపాడు. శ్రీమంతుడు.. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్ని నిర్మించి.. ప్రస్తుతం సుకుమార్-చరణ్ కాంబినేషన్లో ‘రంగస్థలం 1985’ను ప్రొడ్యూస్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ చైతూ-చందూల సినిమాను నిర్మించబోతోంది.