చైతు , సామ్ మొదలు పెట్టారు..

0నాగ చైతన్య , సమంతలు కలిసి నటిస్తే చూడాలనుకునేవారికి తీపి కబురు..వీరిద్దరూ కలిసి నటించబోతున్న చిత్రం ఈరోజు మొదలు అయినట్లు చైతు ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.

ట్విట్టర్ ద్వారా చైతన్య మాట్లాడుతూ ‘ఈరోజు ఖచ్చితంగా కొత్త రోజు. సమంతతో కలిసి వర్క్ చేయడానికి వెళ్తున్నాను’ అంటూ ఇద్దరు కలిసి వెళ్తున్న ఫోటో ను షేర్ చేసాడు. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ డైరెక్ట్ చేయనున్నారు.

పెళ్లి తర్వాత చైతు , సామ్ లు కలిసి నటిస్తుండడం తో ఈ మూవీ పై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు ఈ మూవీ పూర్తి అవుతుందా..ఎప్పుడెప్పుడు వీరిద్దరిని స్క్రీన్ ఫై చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఇక వీరిద్దరి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చైతు ‘సవ్యసాచి’, మారుతి సినిమాల్లో నటిస్తుండగా , సమంత నటించిన ‘రంగస్థలం’ మార్చి 30న విడుదలకానుంది. ఈ రెండు చిత్రాల ఫై ఇరువురు మంచి ఆశలే పెట్టుకున్నారు.