సవ్యసాచికి సమస్య లేదు

0నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సవ్యసాచి గురించి గత కొద్ది రోజులుగా ఏవేవో కథనాలు వస్తున్న నేపధ్యంలో అక్కినేని ఫాన్స్ కొంత ఆందోళన చెందిన మాట వాస్తవం. దీని కన్నా ఆలస్యంగా ప్రారంభమైన శైలజారెడ్డి అల్లుడు ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని వాటి తాలూకు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో టీమ్ షేర్ చేసుకోవడం వల్ల అది ఇంకా రెట్టింపు అయ్యింది. కానీ నిజానికి సవ్యసాచికి ఎటువంటి సమస్యా లేదు. కీలకమైన ఆరిస్టులందరూ ఉండాల్సిన కాంబో సీన్లు కొన్ని షూట్ చేయాల్సి ఉండటం వల్ల కాల్ షీట్స్ అనుకూలంగా దొరకకపోవడంతో తప్పని సరి పరిస్థితుల్లో వాయిదా వేయాల్సి వచ్చింది. అంతే తప్ప బయట ప్రచారం జరుగుతున్నట్టు ఎలాంటి రీ షూట్ సవ్యసాచికి చేయటం లేదు. ఇందులో నెగటివ్ షేడ్స్ లో చాలా కీలక పాత్ర చేస్తున్న మాధవన్ షూటింగ్ కొంత బాలన్స్ ఉన్నప్పుడు ప్రమాదానికి గురై రెండు నెలలకు పైగా బెడ్ రెస్ట్ లో ఉన్నాడు. ఇటీవలే పూర్తిగా కోలుకున్నట్టు తన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు కూడా. సో మాధవన్ ఉండాల్సిన ఆ పార్ట్ కూడా మొత్తం ఓ 10 రోజుల షూటింగ్ తో కంప్లీట్ గా అయిపోతుందని యూనిట్ సమాచారం.

సో అందరు అనుకున్నట్టు సవ్యసాచికి ఏ ట్రబులూ లేదు. షూటింగ్ పూర్తి చేసాక ప్రమోషన్  గురించి విడుదల తేదీ గురించి నిర్ణయించాలని నిర్మాతలు డిసైడ్ కావడంతో అప్ డేట్స్ ఇప్పటి దాకా ఆగిపోయాయి. బిజినెస్ పరంగా కూడా సవ్యసాచికి మంచి క్రేజ్ వచ్చింది. ఆంధ్ర ప్రాంతం హక్కుల డీల్ ఇప్పటికే 9.5 కోట్లకు కుదిరినట్టు సమాచారం. సీడెడ్ కూడా 3 కోట్ల దాకా వస్తుందనే అంచనాలు ఉన్నాయి. కర్ణాటకకు కోటికి పైగానే అడిగారట. ఎలా చూసుకున్నా ఇవి చాలా మంచి డీల్స్. మరికొద్ది రోజుల్లో ఫైనల్ చేయబోతున్నారు. 30 కోట్ల దాకా బడ్జెట్ తో నాగ చైతన్య కెరీర్ లోనే కాస్ట్లీ మూవీగా తెరకెక్కిన సవ్యసాచిలో భూమిక మరో కీలక పాత్రలో కనిపించనుంది. దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ వచ్చే లోపు మరో నెల రోజులు పట్టేలా ఉంది. ఒక చేయి తన ఆధీనంలో ఉందని ఒక సరికొత్త పాత్రలో నాగ చైతన్య  చేస్తున్న సవ్యసాచి మీద ట్రేడ్ కూడా భారీ అంచనాలతో ఉంది