సవ్యసాచి బోణీ బాగుందే!!

0

శైలజారెడ్డి అల్లుడు తర్వాత నాగ చైతన్య తక్కువ గ్యాప్ లోనే సవ్యసాచితో పలకరించబోతున్నాడు. సీజే వర్క్ కారణంగా విడుదల ఆలస్యమవుతూ వచ్చిన సవ్యసాచి చాలా వినూత్నమైన కథాంశంతో రూపొందిన కారణంగా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి హైప్ తెచ్చుకుంది. టీజర్ తో పాటు ఫస్ట్ ఆడియో సింగల్ కూడా అంచనాలకు తగ్గట్టే ఉండటంతో బిజినెస్ కూడా వేగం పుంజుకుందని సమాచారం. ఒక్క ఆంధ్ర థియేట్రికల్ హక్కులనే 9 కోట్లకు అమ్మేసినట్టు ఇన్ సైడ్ టాక్. సీడెడ్ కూడా 3 కోట్ల దాకా మొత్తం ఎన్వీ ప్రసాద్ తీసుకున్నారని తెలిసింది. నైజామ్ నుంచి ట్రేడ్ ఎంక్వయిరీలు వస్తున్నప్పటికీ ఆశించిన రేట్ కోసం నిర్మాతలు వెయిట్ చేస్తున్నట్టుగా వినికిడి. ఐదు కోట్ల దాకా వచ్చే అవకాశం ఉండటంతో ఇంకొద్ది రోజులు వెయిట్ చేసే ఛాన్స్ ఉంది.

సవ్యసాచిలో ఒక చేయి తన ఆధీనంలో లేని ఒక విభిన్నమైన పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకే శరీరం పంచుకుని పుట్టిన కవల సోదరుడిగా చైతు చాలా స్పెషల్ గా ఇందులో ఉండబోతున్నాడని టీజర్ లో కూడా అర్థమైపోయింది. తమిళ నటుడు మాధవన్ భూమికలు కీలక పాత్రలు పోషిస్తున్న సవ్యసాచికి కీరవాణి సంగీతం అందించడం మరో ఆకర్షణగా మారింది. అంచనాలను మెల్లగా పెంచుకుంటూ పోతున్న ఈ మూవీ మీద అభిమానులు సైతం చాలా నమ్మకంగా ఉన్నారు.

థ్రిల్లర్స్ బాగా హ్యాండిల్ చేయగలను అని కార్తికేయతోనే ఋజువు చేసుకున్న దర్శకుడు చందు మొండేటి దీన్ని తీర్చిదిద్దిన తీరుపై ఇప్పటికే ఇండస్ట్రీ పాజిటివ్ బజ్ నెలకొంది. చైతుకి ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ అవసరమైన తరుణంలో సవ్యాసాచి దాన్ని నెరవేరుస్తుందనే ధీమాలో ఉన్నారు ఫ్యాన్స్. నవంబర్ 2 వ తేదీన ఈ సినిమా విడుదల అని సవ్య సాచి టీం నుంచి లీక్స్ వస్తున్నాయి.
Please Read Disclaimer