నాకిద్దరు కావాలంటున్న నాగ శౌర్య!

0తెలుగులో ఈమధ్య ‘ఇద్దరు భార్యల మధ్య ఇరుక్కోవడం.. పెద్దిల్లు-చిన్నిల్లు’ టైపు కాన్సెప్ట్ సినిమాలు తగ్గిపోయాయి.  పాత కాలంలో అయితే శోభన్ బాబు ఇలాంటి సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా ఉండేవారు. అయన ఇద్దరి మధ్య నలిగిపోతుంటే.. ప్రేక్షకకులకు అన్ని రకాల ఎమోషన్స్ వచ్చేవి.  ఆ తర్వాత కాలం లో జగపతి బాబు ఆ భాద్యత తీసుకున్నాడు.. జస్ట్ తీసుకోవడమే కాదు అదే పనిగా ఇద్దరు లేడీల మధ్యలో నలిగే పాత్రలు చేసి చేసి లేడీస్ లో సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఆ స్టైల్ లో చేసిన సినిమాల్లో ‘ఆయనకిద్దరు’ ఓ సూపర్ హిట్. 

EVV సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆయనకిద్దరు’ లో కామెడీ మాత్రమే కాదు అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఫుల్లుగా ఉంటాయి. ఆ సంగతి ఇప్పుడు ఆ సంగతెందుకంటే.. ఆ సినిమా రీమేక్ లో యంగ్ హీరో నాగ శౌర్య నటిస్తాడట. ఈ సినిమాను ప్రస్తుత ట్రెండుకు తగ్గట్టుగా మార్చి స్క్రిప్ట్ తయారు చేశాడట రాజా అనే దర్శకుడు. ఈ సినిమాను శ్రీ భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై V. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తాడట. ఈ సినిమా షూటింగ్ ను ఏడాది చివరలోగా ప్రారంభిస్తారని సమాచారం. నాగ శౌర్య కు జంటగా నటించబోయే ఇద్దరు హీరోయిన్లు ఇతర టెక్నిషియన్స్ వివరాలు త్వరలో ప్రకటిస్తారట.

మరోవైపు నాగ శౌర్య ప్రస్తుతం ‘@నర్తనశాల’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆగష్టు లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. నాగ శౌర్య గత రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరచడంతో ఈ సినిమా పై సక్సెస్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు.