గే పాత్రలో నటిస్తున్న యంగ్ హీరో?

0ఒక కొత్త సినిమా విడుదలకు సిద్ధమవుతోంది అంటే దాని మీద బోలెడు రూమర్లు వస్తాయి అన్నది అందరికి తెలిసిన విషయమే. కాకపోతే నాగ శౌర్య విషయంలో ఆ రూమర్లు కొంత కామెడీగా ఉన్నాయి. చలో సినిమాతో హిట్ అందుకున్న శౌర్యకి కణం సినిమా పెద్దగా సక్సెస్ ఇవ్వలేకపోయింది.ఈ యంగ్ హీరో ఇప్పుడు నర్తనశాల అని ఒక సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో హీరో పాత్ర గురించి కొన్ని వింత రూమర్లు వస్తున్నాయి. ఈ సినిమాలో నాగ శౌర్య గే పాత్రలో కనపడనున్నదట. కొత్త దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. కాకపోతే సొంత ప్రొడక్షన్ బ్యానర్లో సినిమా చేస్తూ శౌర్య ఇలాంటి ఎక్స్ పెరిమెంటల్ పాత్రలు చేయడమేమిటో ప్రేక్షకులకు అర్థంకావట్లేదు. ఇదిలా ఉండగా కశ్మీర పర్దేశి – యామిని భాస్కర్ అని ఇద్దరు హీరోయిన్లు ఉన్న ఈ సినిమాలో హీరో గే అవడం ఏంటి అని సందేహాలు వ్యక్తపరుస్తుండగా కొత్త రూమర్ ఒకటి ఇండస్ట్రీ లో తిరుగుతోంది. సినిమాలో నాగ శౌర్య కాదు – సపోర్టింగ్ రొల్ లో నటించిన అజయ్.. గే పాత్రలో కనిపిస్తున్నాడట.

సినిమా మొత్తం అలానే కాకుండా కేవలం కొంత భాగం వరకు మాత్రమే ఇలా ఉండబోతున్నాడు. టైటిల్ చెప్తున్నట్టుగానే ఈ సినిమాలో యాక్టర్లు వారి ఐడెంటిటీ ని మార్చుకుని బతకడం – దాని వల్ల వాళ్లు ఎదుర్కొన్న పరిస్థితులే సినిమా కథ. ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధమవుతోంది.