రీల్ నాన్న పాత్ర లో రియల్ మావయ్య

0

అల్లు శిరీష్ ప్రస్తుతం మలయాళం సూపర్ హిట్ ‘ఏబీసిడీ’ (అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి) తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. దుల్కర్ సల్మాన్ హీరో గా నటించిన ఈ సినిమా ఈ జెనరేషన్ యూత్ కు ఫుల్ గా కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ తో ఉంటుంది. ఈ సినిమా లో హీరో తండ్రి పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు శిరీష్.

తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక నాగబాబు తో కలిసి ఉన్న ఒక ఫోటో ను పోస్ట్ చేసి.. “రియల్ లైఫ్ అంకుల్. రీల్ లైఫ్ ఫాదర్. ‘ఏబీసిడి’ స్క్రిప్ట్ విన్న దగ్గర నుండి నాగబాబాయ్ ని మాత్రమే ఈ పాత్ర లో ఊహించుకున్నాను. ఫైనల్ గా ఆయన తో కలిసి నటిస్తున్నందుకు సంతోషం గా ఉంది. ఆయన తో కలిసి చేసే సీన్స్ చాలా ఎంజాయ్ చేశాను” అంటూ ట్వీట్ చేశాడు. నాగబాబు ఈ మధ్య ‘అరవింద సమేత’ సినిమాలో ఎన్టీఆర్ కు తండ్రి పాత్ర లో నటించిన విషయం తెలిసిందే. పాత్ర నిడివి తక్కువ అయినప్పటికీ సినిమా కథ మొత్తం దాని మీదే డ్రైవ్ అవుతుంది. ఇప్పుడు శిరీష్ కోసం ఫాదర్ గా మారడం విశేషం.

ఈ సినిమా తో సంజీవ్ రెడ్డి దర్శకుడి గా పరిచయం అవుతున్నాడు. మధుర శ్రీధర్ ఈ సినిమా కు నిర్మాత. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 8 న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సాలిడ్ హిట్ కోసం చాలా రోజుల నుడి వేచి చూస్తున్న అల్లు శిరీష్ ఈ సినిమా విజయం పై భారీ గా నమ్మకం పెట్టుకున్నాడు.
Please Read Disclaimer