మరోసారి అలరించిన నాగ్ – అఖిల్ కాంబో!

0రియల్ లైఫ్ తండ్రి – కొడుకులను లేదా అన్నదమ్ములను స్క్రీన్ పై ఒకే సారి చూస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా సర్ ప్రైజ్ – కొత్తగా ఫీల్ అవుతారు. అందుకే ఎక్కువ సినిమాలో గెస్ట్ రోల్ లో తండ్రి – కొడుకు – అన్న లేదా తమ్ముడు ఇలా ఆ సినిమా హీరోకు సంబంధించిన వారిని దర్శకులు చూపించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆమద్య ‘మనం’ చిత్రంలో అక్కినేని ఫ్యామిలీ సభ్యులందరిని చూసి మురిసి పోయిన ఫ్యాన్స్ మళ్లీ మరోసారి ఆ కాంభినేషన్ ను కోరుకుంటున్నారు. ఏయన్నార్ లేకపోయిన నాగార్జున మరియు ఆయన తనయులు కలిసి సినిమా చేయాలని ఆశ పడుతున్నారు.

నాగచైతన్య కోసం ప్రేమమ్ చిత్రంలో మెరిసిన నాగార్జున చిన్న కొడుకు అఖిల్ తో మాత్రం ఇంకా స్క్రీన్ షేర్ చేసుకోలేదు. అయితే బుల్లి తెరపై మాత్రం అఖిల్ – నాగార్జునల కాంబో చూస్తూనే ఉన్నాం. వీరిద్దరు కలిసి ప్రముఖ షాపింగ్ మాల్ అయిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఆమద్య వీరిద్దరు కలిసి ఒక యాడ్ లో నటించారు. ఆ యాడ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మళ్లీ ఇప్పుడు సౌత్ ఇండియా వారి కొత్త యాడ్ వచ్చింది. ఈ యాడ్ లో కూడా నాగార్జున – అఖిల్లు కలిసి నటించారు. కొత్త యాడ్ లో ఇద్దరు కూడా చాలా యాక్టివ్ గా కనిపించారు. ఆ యాడ్ ను అలాగే చూడాలనిపిస్తుంది. అక్కినేని ఫ్యాన్స్ సదరు యాడ్ కు ఫిదా అవుతున్నారు.

ప్రస్తుతం అఖిల్ మూడవ సినిమా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ ఏడాది చివర్లో ఆ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో వైపు నాగార్జున మల్టీస్టారర్ చిత్రంలో నానితో కలిసి నటిస్తున్నాడు. ఇలా తండ్రి కొడుకులు వేరు వేరుగా చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. బుల్లి తెరపైనే కాకుండా త్వరలోనే వీరిద్దరి కాంబో వెండి తెరపై కూడా చూడాలని సినీ జనాలు కూడా కోరుకుంటున్నారు.