నాగ్ – జేబీ లు ఒకరినొకరు ఇలా పిలుచుకుంటారట!

0

అందరూ అందరినీ సొంతపేర్లతోనే పిలవరు. కొందరు ముద్దు పేర్లతో పిలుచుకుంటారు. మరికొందరు కస్టమైజ్డ్ పేర్లతో పిలులుచుకుంటారు.. అంటే తమకు మాత్రమే ప్రత్యేకంగా ఉండే పేరన్నమాట. ‘అరవింద సమేత’ ప్రమోషన్ ఈవెంట్స్ లో ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ఒకరినొకరు ‘స్వామి’ అని పిలుచుకుంటామని తెలిపారు. దీనికి త్రివిక్రమ్ కారణం కూడా చెప్పాడు. త్రివిక్రమ్ రైటర్ గా ఉన్నప్పుడే జూనియర్ ఎన్టీఆర్ పెద్ద స్టార్ అని.. వయసులో చిన్నవాడైనా పేరు పెట్టి పిలవడం బాగుండదని ‘స్వామి’ అని పిలవడం మొదలు పెట్టాడట. ఇక ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ ని అలాగే స్వామి అని సంభోదించడం ప్రారంభించాడట.

ఇలాగే సీనియర్ హీరోలు అక్కినేని నాగార్జున – జగపతి బాబులు ఒకరిని ఒకరు ‘చౌ-చౌ’ అని పిలుచుకుంటారట. చౌదరి-చౌదరి అని ఇద్దరూ తమ క్యాస్ట్ పేరుతో పిలుచుకుంటున్నారని మీరు పుసుక్కున అనుకునేరు.. కానీ కాదు. జగపతి బాబు మొదటి నుండి క్యాస్ట్ గీస్టు అనే వాటికి వ్యతిరేకమే. నిజానికి జగపతి బాబు ముద్దుపేరు చిన్నప్పటి నుండి చౌదరిగా ఉందట. కారణం ఏంటంటే.. జగపతి బాబుకు వాళ్ళ తాతగారి పేరు పెట్టడంతో.. జగపతి అమ్మగారు ఆ పేరుతో కొడుకుని పిలవలేక పోయేవారట. అప్పట్లో మామగారి పేరును అలా పిలిచేవారు కాదు. దీంతో ఆవిడ ‘చౌదరి’ అని పిలవడం మొదలు పెట్టిందట.

ఇక జగపతి నాన్నగారు VB రాజేంద్ర ప్రసాద్.. ఏఎన్నార్ ఇద్దరూ మంచి మిత్రులట. దీంతో నాగార్జున.. జగపతి ల మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇద్దరికీ రెండు మూడేళ్ళ వయసు తేడా ఉన్నప్పటికీ క్లోజ్ గా ఉంటారు. అందుకే జగపతి ని నాగ్ చౌ-చౌ అని పిలిస్తే.. జగపతి తిరిగి నాగార్జునను చౌ-చౌ అని పిలవడం మొదలు పెట్టాడట.




Please Read Disclaimer