నాగార్జున – నాగ చైతన్య కాంబో

0

‘సోగ్గాడే చిన్ని నాయనా’ సూపర్ హిట్ సాధించిన తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ గా ‘బంగార్రాజు’ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ వినిపించిన సీక్వెల్ స్క్రిప్ట్ సంతృప్తికరంగా లేకపోవడంతో ఆ సినిమా ఆలోచన పక్కన పెట్టినట్టు నాగార్జున గతంలో తెలిపాడు.

కానీ ‘నేల టికెట్’ పరాజయం తర్వాత కళ్యాణ్ కృష్ణ ‘బంగార్రాజు’ స్క్రిప్ట్ పై మళ్ళీ వర్క్ చేయడం మొదలు పెట్టాడట. రీసెంట్ గా ఆ స్క్రిప్ట్ వర్క్ ఓ కొలిక్కి వచ్చిందని.. కళ్యాణ్ కృష్ణ వినిపించిన వెర్షన్ నాగార్జున కు నచ్చడంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ సినిమాలో ధమాకా ఏంటంటే నాగర్జున తో కలిసి నాగ చైతన్య కూడా నటిస్తాడట. ఇక ఈ సినిమా కథ కూడా ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది. ‘సోగ్గాడే..’ లో బంగార్రాజు గా.. రాము గా నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే. రాము కు సమస్య వచ్చినప్పుడు ఆత్మ రూపంలో వచ్చి ఆ సమస్యను పరిష్కరిస్తాడు. ఇప్పుడు సీక్వెల్ లో రాము – సీత(లావణ్య త్రిపాఠి) జంటకు ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకే నాగ చైతన్య. ఫుల్ గా బంగార్రాజు లక్షణాలతో ఉంటాడట. కానీ మనవడు సమస్యలో చిక్కుకోవడంతో మళ్ళీ బంగార్రాజు ఆత్మగా వచ్చి మనవడి కి సహాయం చేస్తాడట.

ఈ లెక్కన నాగార్జున – నాగ చైతన్య తండ్రీ కొడుకులుగా.. తాత మనవళ్ళుగా ప్రేక్షకులను అలరిస్తారన్నమాట. నిజమో కాదో తెలియదు గానీ కథ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా? పైగా సీనియర్ .. జూనియర్ అక్కినేని హీరోల మల్టిస్టారర్.. ఫ్యాన్స్ కు ఇంతకంటే ఏం కావాలి?
Please Read Disclaimer