ఫుల్లు కిక్కులో ఫస్ట్ లుక్ దేవదాసు

0కింగ్ నాగార్జున న్యాచురల్ స్టార్ నానిలు కలిసి ‘దేవదాస్’ అనే ఓ కామెడీ ఎంటర్టైనర్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాగ్ ఓ డాన్ పాత్ర పోషిస్తుండగా నాని ఒక డాక్టర్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఇంట్రెస్టింగ్ పోస్టర్స్ తో ఆడియన్స్ లో కుతూహలం పెంచిన మేకర్స్ ఈ రోజు ఫస్ట్ లుక్ తో మనముందుకు వచ్చారు.

ఈమధ్యనే ఒక మందు బాటిల్ పోస్టర్లో ఆ మూత ఆగష్టు 7 న ఓపెన్ అవుతుందంటూ హింట్ ఇచ్చిన ‘దేవదాస్’ టీమ్ ఈ రోజు ఫస్ట్ లుక్ లో ఆ మందు బాటిల్ ఓపెన్ చేసి ఫుల్ గా పట్టించి ఒకే బెడ్డుపై నిద్ర పోతున్న నాగార్జున నాని లని చూపించారు. నాగార్జున ఎడమ చేతిలో మందు బాటిల్ పట్టుకొని ఉంటే కుడి చేతిలో రివాల్వర్ పట్టుకొని ఉన్నాడు. ఒక షూ కాలికి ఉంటే – రెండో షూ కాలి కింద ఉంది.. పక్కనే పడుకొని ఉన్న డాక్టర్ అన్ని ఇన్-షర్ట్ కాస్త తొలగిపోయిఉంది.. నోరు కాస్త ఓపెన్ చేసి ఒళ్ళు తెలియడం లేదు అన్నట్టుగా మత్తు నిద్రలో జోగుతున్నాడు. మెడకి స్టెతస్కోప్ అలానే ఉంది.

పోస్టర్ ఎలా ఉంది అని ఒక్క ముక్కలో చెప్తే.. కిర్రాక్! నాగార్జున నానిలు ఇద్దరూ కలిసి ఆడియన్స్ కు పిచ్చెక్కించేలా ఉన్నారు. నాగర్జున కు డాన్ రోల్స్ కొత్తకాదు.. దాన్లో ఒక కొత్త వేరియేషన్ కాబట్టి ఇక చెలరేగిపోతాడు.. ఇక పక్కనేమో న్యాచురల్ యాక్టింగ్ చేసే డాక్టర్.. ఇక ఇద్దరూ కలిసి చేసే హంగామా ఎలా ఉందొ తెలియాలంటే మనం సెప్టెంబర్ 27 వరకూ వెయిట్ చెయ్యాలి. ఎందుకు అని ఇన్నోసెంట్ గా అడక్కండి.. ఆరోజే సినిమా రిలీజ్!

మణి శర్మ సంగీతం అందిస్తున్న ఈ మల్టిస్టారర్ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. సీనియర్ నిర్మాత చలసాని అశ్విని దత్ ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఆకాంక్ష సింగ్ రష్మిక మందన్న లో ఈ సినిమాకు గ్లామర్ టచ్ ఇస్తారు.