‘దేవదాస్’ గురించి నాగ్.. నానిల కామెంట్లు

0ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న కలయిక… నాగార్జున – నాని. `దేవదాస్` కోసం కలిశారు ఈ ఇద్దరూ. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మంగళవారం విడుదలైంది. లుక్ కొత్తగా – కూల్ గా ఉందనిపిస్తోంది. లుక్నిబట్టి చూస్తే నాగ్ దేవ్ అనే డాన్ పాత్రలోనూ… నాని దాస్ అనే డాక్టర్ పాత్రలోనూ కనిపిస్తారని అర్థమవుతోంది. మరి డాక్టర్ కీ – డాన్ కి ఎక్కడ కుదిరిందనేది తెరపైనే చూడాలి. ఇద్దరూ మందు కొట్టి పడిపోయినట్టుగా ఉంది లుక్ చూస్తే. వీళ్లిద్దరూ లేచేది మాత్రం సెప్టెంబరు 27నే అని ప్రకటించింది చిత్రబృందం. లేస్తే మాత్రం అల్లరి మామూలుగా ఉండదని కూడా ప్రకటించింది.

నాగార్జున… నాని ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారు. వీళ్లు సినిమా ప్రమోషన్ ని తనదైన శైలిలో చేస్తున్నారు. టైటిల్ని ప్రకటించేరోజు ఇద్దరూ కూడబలుక్కుని వాళ్ల స్టైల్ లోనే ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ సందర్భంగా ఇద్దరూ ట్విట్టర్ లో ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. “నా పక్కన పారు ఉంటుందనుకుంటే – దాస్ ఫెలో ఉన్నాడు“ అంటూ నాగ్ కామెంట్ చేశాడు. నాని అయితే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోయాడు. “1996లో నాగార్జున సార్ నటించిన `నిన్నే పెళ్లా డతా` విడుదలయింది. నాగ్ సార్ స్క్రీన్ పైన.. నేనేమో దేవి థియేటర్ బయట క్యూలోన. 2018లో దేవదాస్. నాగార్జున – నేను కలిసి ఫస్ట్ లుక్ లో“ అంటూ తన ఆనందాన్ని – ఆశ్చర్యాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకొన్నాడు.