అక్కినేని ఫ్యాన్స్ ఆందోళన తగ్గింది

0విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ఆఫీసర్ సినిమా మొదటి రోజుకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. శివ కాంబినేషన్ రిపీట్ అవుతుందని అంతా అనుకున్నారు. వర్మ చెప్పిన విధానం అయితే కాస్త నమ్మకాన్ని కూడా కలిగించింది. అందులో భాగంగానే ముందే అఖిల్ తో కూడా ఓ సినిమా ఫిక్స్ చేసుకున్నట్లు చెప్పేశాడు. చాలా వరకు అక్కినేని అభిమానుల్లో ఆనందం కంటే ఆందోళనే ఎక్కువైంది.

అసలే అఖిల్ హిట్ కోసం అభిమానులు చాలా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో వర్మతో రిస్క్ అవసరమా అనే కామెంట్స్ చాలా వచ్చాయి. ఇక మొత్తానికి ఆ కామెంట్స్ కి వారి ఆందోళనకి ఎండ్ పడినట్లు అయ్యింది. ఆఫీసర్ డిజాస్టర్ తరువాత ఆర్జీవీ కి అక్కినేని వారు నమస్కారం పెట్టేయాలని డిసైడ్ అయ్యారట. నాగ్ ఒప్పుకున్నా ఫ్యాన్స్ ఒప్పుకోరని అఖిల్ తో సినిమా క్యాన్సిల్ చేసేశారట. ప్రస్తుతం అఖిల్ అయితే సేఫ్ అనే న్యూస్ వస్తోంది.

ఇక అఖిల్ ప్రస్తుతం వెంకీ అట్లూరితో ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాతో అయినా మంచి హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. మరి ఆ సినిమా తరువాత అఖిల్ ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. నాగ్ అయితే పెద్ద దర్శకులతో సెట్ చేయాలనీ అనుకుంటున్నాడట. గతంలో కొరటాల శివ పేరు కూడా వినిపించింది. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూద్దాం.