స్పై థ్రిల్లర్ సక్సెస్ మీట్ కి నాగార్జున

0శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా తెరకెక్కిన స్పై థ్రిల్లర్ ‘గూఢచారి’ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఆడియన్స్ రెస్పాన్స్ తో పాటుగా క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్న ఈ సినిమా టాలీవుడ్ సెలబ్రిటీలను కూడా మెప్పిస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు నాగార్జున లాంటి పెద్ద స్టార్స్ ‘గూఢచారి’ సినిమాను ట్విట్టర్ ద్వారా ప్రశంసించారు.

అంతే కాదు ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో జరగనున్న ‘గూఢచారి’ సక్సెస్ మీట్ కు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరవుతున్నాడట. ఈ విషయాన్ని గూఢచారి టీమ్ ధృవీకరించింది. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో సక్సెస్ మీట్ జరుగుతోందని నాగార్జున సర్ ఈ ఈవెంట్ కు ఛీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారని వెల్లడించారు. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నాగార్జున బ్యానర్ లో ‘గూఢచారి’ కి పోటీగా రిలీజ్ అయిన ‘చి ల సౌ’ మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్ రాబట్టడంలో పెద్దగా జోరు చూపడం లేదు. అయినప్పటికీ పోటీగా రిలీజ్ అయిన సినిమాను మెచ్చుకోవడమే కాకుండా సక్సెస్ మీట్ కి హాజరవడం చూస్తుంటే ‘కింగ్’ అనే బిరుదు నాగ్ కి సరిగ్గా సరిపోయింది అనిపిస్తుంది.

మరోవైపు ‘గూఢచారి’ సక్సెస్ తో అడివి శేష్ – శశి కిరణ్ తిక్కా లు ఈ సినిమా కు సీక్వెల్ కూడా ఉంటుందని వెల్లడించారు. చూస్తుంటే ఈ ‘గూఢచారి’ సీక్వెల్స్ మాత్రమె కాకుండా తెలుగు లో స్పై థ్రిల్లర్ల ట్రెండ్ కు మొదలు పెట్టేలా ఉంది.