నాగార్జున ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అదే:సమంత

0



గ్లామర్ తో పాటు నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుంటోన్న టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత….వరుస హిట్ లతో దూసుకుపోతోంది. రాజుగారి గది-2లో కీలకమైన పాత్ర పోషించిన సమంత…..రంగస్థలం – మహానటి చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలను పోషించి ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలనూ దక్కించుకుంది. యూటర్న్ తో సెప్టెంబర్ 13న సమంత మరోసారి ప్రేక్షకుల మందుకు రాబోతోంది. తాజాగా విడుదలైన యూటర్న్ `ఫస్ట్ లుక్` పోస్టర్ ను తన ట్విట్టర్ ఖాతాలో సమంత షేర్ చేసింది. ఈ సందర్భంగా అభిమానులతో సమంత చాట్ ఆసక్తికరంగా సాగింది.ఇప్పటివరకు నాగార్జున తనకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏమిటని అభిమాని అడిగిన ప్రశ్నకు…సామ్ ఆసక్తికర సమాధానమిచ్చింది. తమ ప్రేమను అంగీకరించడమే మామ ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అని సామ్ ట్వీట్ చేసింది.

యూ టర్న్ కు సంబంధించి అనేక ఆసక్తికర విషయాలను సమంత వెల్లడించింది. ఆ సినిమాలో తాను జర్నలిస్ట్ రచన పాత్రలో కనిపిస్తానని చెప్పింది. ఈ చిత్రంలో తాను ముక్కుపుడకతో కనిపిస్తానని అయితే తాను ముక్కు కుట్టించుకోలేదని చెప్పింది. దర్శకుడు పవన్ కుమార్ కి ఉన్న టాలెంట్ కారణంగానే ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నానని చెప్పింది. తెలుగు – తమిళ భాషల్లో కూడా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పానని తెలిపింది. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా ఆది పినిశెట్టి – రిపోర్టర్ గా రాహుల్ రవీంద్రన్ కీలకమైన పాత్రల్లో కనిపిస్తారని చెప్పింది. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని – సెప్టెంబర్ 13న విడుదల చేస్తున్నామని చెప్పింది.