నాగార్జున-నాని మల్టీ స్టారర్ ?

0Nagarjuna-Nani-Multistarrerవరుస సూపర్ హిట్స్‌తో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని. నేచురల్ స్టార్‌గా ఆకట్టుకుంటున్న నాని, మాస్ హీరోయిజం జోలికి పోకుండా ఆసక్తికరమైన కథలతో అలరిస్తున్నాడు. ఇప్పటికే లవర్ బాయ్, ఫ్యామిలీ హీరో ట్యాగ్లు సొంతం చేసుకున్న ఈ కుర్ర హీరో ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో రైడ్, ఎవడే సుబ్రమణ్యం లాంటి సినిమాల్లో ఇతర హీరోలతో కలిసి నటించినా.. సీనియర్ హీరోతో మాత్రం ఇంత వరకు మల్టీ స్టారర్ సినిమా చేయలేదు.

తాజా సమాచారం ప్రకారం.. నాని, సీనియర్ హీరో నాగ్‌తో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేయనున్నాడట. గతంలో నిఖిల్‌తో కలిసి నాగార్జున మల్టీ స్టారర్ చేస్తున్నాడన్న వార్తలు వినిపించాయి. మరి అదే సినిమాను నిఖిల్‌కు బదులు నానితో చేస్తున్నాడా..? లేక ఇది వేరే సినిమానా అన్న విషయం తెలియాంలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజుగారి గది 2 సినిమాలో నటిస్తున్నాడు నాగ్. నాని కూడా నిన్నుకోరి సినిమాతో పాటు దిల్ రాజు నిర్మాణంలో ఎమ్సీఏ సినిమాకు రెడీ అవుతున్నాడు.