ఓం నమో వెంకటేశాయ సినిమా టీజర్

0మనం.. సోగ్గాడే చిన్ని నాయన.. ఊపిరి.. వరుస హిట్స్ తో జోరు మీదున్న అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓం నమో వెంకటేశాయ. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు-నాగ్ కాంబినేషన్ లో వస్తున్న భక్తి చిత్రం కావడంతో ముందు నుంచి ఈ సినిమాపై అంచనాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి.. ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు.

ఓం నమో వెంకటేశాయ టైటిల్ వినగానే ఇదో భక్తి చిత్రం అనుకుంటాం. కానీ టీజర్ లో మాత్రం ఆ లక్షణాలు అక్కడక్కడా చూపించారంతే. హథీరాం పాత్రలో కనిపిస్తున్న నాగార్జున.. ఓ గ్రూప్ తో పాటు కత్తులు పట్టుకు నుంచోవడం.. పైపంచెను విసిరి ఫైటింగులు చేయడం.. జగపతి బాబును సీరియస్ మోడ్ లో చూపించడం లాంటివే.. సగం టీజర్ లో ఉంటాయి. భక్తి చిత్రాల్లో ఇలాంటివి కాసింత సహజమే కానీ.. మరీ ఇంత యాక్షన్ ను.. అది కూడా అన్నమయ్య కాంబినేషన్ చూపించడం ఆశ్చర్యం కలిగించే విషయం.

వెంకటేశ్వరునిగా సౌరభ్ జైన్ లుక్ చాలా బాగుంది. ప్రగ్యా జైస్వాల్ ను గ్లామర్ యాంగిల్ లో ఉపయోగించుకున్న సంగతి ముందే చెప్పేశారు. ఈ టీజర్ లో కనిపించిన కొత్త విషయం ఏంటంటే.. అనుష్క అటు భక్తురాలిగానే కాదు.. ఇటు దేవత పాత్రలోనూ సీరియస్ లుక్స్ ఇవ్వడమే. మొత్తం మీద ఓం నమో వెంకటేశాయ టీజర్ అయితే.. భక్తి మూవీ అనే ఫీలింగ్ కంటే.. దేవుడి గుడి చుట్టూ తిరిగే యాక్షన్ డ్రామాలా ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.