నాగార్జున బీరు ఎక్కడ కొట్టాడో తెలుసా.?

0



టాలీవుడ్ మన్మథుడైనా సరే.. ఆయనకు కొన్ని వ్యక్తిగత అలవాట్లు అభిరుచులు ఉంటాయి.. ఎంత పెద్ద స్టార్ గా ఎదిగినా సరే తొలినాళ్లలో నాగార్జున అందరిలాగే చిలిపి పనులు చేశాడట.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు.. నాన్న నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియో కొన్నప్పుడు అక్కడ భీకరంగా అడవిలా ఉండేదట.. అమ్మానాన్నలకు తెలియకుండా ఆ అడవిలోని కొన్ని ప్రత్యేక ప్రదేశాలకు వెళ్లి నాగార్జున బీర్ కొట్టేవాడట.. ఆ ప్రాంతం మళ్లీ ఇప్పుడు ‘గూఢచారి’ సినిమాలో కనిపించేసరికి తన పాత జ్ఞాపకాలను నాగార్జున నెమరువేసుకున్నాడు..

తాజాగా అక్కినేని నాగార్జున ‘గూఢచారి’ మూవీ సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అన్నపూర్ణ స్టూడియోలో దాదాపు 17 రోజుల పాటు ‘గూఢచారి’ సినిమా షూటింగ్ చేశారని తెలిసిందని.. కానీ సినిమా చూస్తుంటే ఎక్కడా అన్నపూర్ణ లోకేషన్లేవీ కనిపించలేదని నాగార్జున చెప్పాడు. దీంతో వీళ్లు ఎక్కడ షూటింగ్ చేశారబ్బా అని తాను ఆశ్చర్యపోయానన్నారు. 30-40 ఏళ్లుగా అన్నపూర్ణ అమూలాగ్రం తిరిగి తనకే తెలియని లోకేషన్లలో ‘గూఢచారి’ తీశారని నాగ్ ప్రశంసించాడు..

గూఢచారి టీం ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత క్వాలిటీ చిత్రం ఎలా తీశారో అర్థం కావడం లేదని నాగార్జున మెచ్చుకున్నాడు. తాను ఎన్నో సార్లు హిమాచల్ ప్రదేశ్ వెళ్లానని కానీ తాను కూడా చూడని అందమైన ప్రదేశాలను సినిమాలో చూపించారని నాగ్ ప్రశంసించాడు.