‘శైలజా రెడ్డి అల్లుడు’ టైటిల్ మర్చి పోయిన నాగ్!

0అక్కినేని హీరో నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. వినాయక చవితి సందర్బంగా ఈనెల 13న విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక తాజాగా జరిగింది. ‘దేవదాస్’ లు నాగార్జున మరియు నానిలు ఈ వేడుకలో పాల్గొన్నారు. చిత్ర యూనిట్ సభ్యులతో పాటు పెద్ద ఎత్తున అక్కినేని అభిమానులు పాల్గొన్న ఈ వేడుక హైదరాబాద్ లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగింది. ఈ సందర్బంగా నాగార్జున ఇచ్చిన స్పీచ్ విషయంలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

‘శైలజా రెడ్డి అల్లుడు’ ప్రీ రిలీజ్ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ సినిమా పేరును సరిగా చెప్పక పోవడం అందరికి ఆశ్చర్యంను కలిగించింది. మాట్లాడిన ఏడు నిమిషాల సమయంలో పలు సార్లు సినిమా టైటిల్ ను చెప్పిన నాగార్జున ప్రతి సారి కూడా తప్పుగానే చెప్పాడు. ఒక్కసారి కూడా నాగార్జున పూర్తిగా ‘శైలజ రెడ్డి అల్లుడు’ అంటూ చెప్పలేదు. టైటిల్ ను పలకడంలో నాగార్జున కాస్త కన్ ఫ్యూజ్ అయినట్లుగా అనిపించింది. నాగార్జున టైటిల్ ను శైలజా రెడ్డి గారి అల్లుడు – శైలజా అల్లుడు – శైలజా రెడ్డి అల్లుడు గారు అంటూ సంబోధించడంతో అభిమానులు కాస్త గందరగోళంకు గురైనట్లుగా అనిపించింది.

కొడుకు సినిమా వేడుకకు వచ్చి ఇలా టైటిల్ విషయంలో గందరగోళంగా మాట్లాడటం చర్చనీయాంశం అవుతుంది. టైటిల్ ను మర్చి పోయి ఇలా మాట్లాడి ఉంటాడా లేదంటే మరేమైనా అయ్యి ఉంటుందా అంటూ అభిమానుల్లో చర్చలు జరుగుతున్నాయి. శైలజ రెడ్డి అల్లుడు చిత్రం ప్రీ రిలీజ్ వేడుకులో పాల్గొన్న ఇతర స్టార్స్ ముఖ్యంగా నాని ఎలాంటి ఇబ్బంది లేకుండా టైటిల్ ను పలకడం జరిగింది. నాగార్జున మాత్రం టైటిల్ సరిగా చెప్పక పోవడం విడ్డూరంగా ఉందని అక్కినేని అభిమానులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.