దేవదాస్ కోసం ఎడిటర్ నాగ్?

0దేవదాస్ 27న విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇంకో పదిహేను రోజులు మాత్రమే టైం ఉండటంతో బాలన్స్ ప్యాచ్ వర్క్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ లో టీమ్ ఫుల్ బిజీగా ఉంది. తనదైనా చైతు అఖిల్ ల దైనా అన్ని దగ్గరుండి చూసుకునే నాగ్ దేవదాస్ విషయంలోనూ అంతే శ్రద్ధ తీసుకుంటున్నట్టు ఇన్ సైడ్ టాక్. దర్శకడు శ్రీరామ్ ఆదిత్యకు కేవలం రెండు సినిమాల అనుభవం మాత్రమే ఉంది. అందులోనూ పెద్ద స్టార్ హీరోలను డీల్ చేయలేదు. అందుకే ఎక్కడైనా తడబడ్డాడేమో అని నాగ్ దగ్గరుండి మరీ అన్ని చూసుకునే పరిస్థితి కనిపిస్తోందని వినికిడి. అదే నిజమైతే ఆ మాత్రం జాగ్రత్త తీసుకోవడం అవసరమే కానీ ప్రమేయం ఎక్కువైతే సమస్యలు రావొచ్చు. నిజానికి శైలజారెడ్డి అల్లుడు వ్యవహారంలో కూడా నాగ్ పర్యవేక్షణ బాగానే సాగిందట. చైతుకు ఇలాంటి జానర్ మొదటిసారి కావడంతో నాగ్ టీమ్ దగ్గరుండి చక్కదిద్దినట్టు తెలిసింది. అందుకే దేవదాస్ ను సైతం ఇలాగే కాస్త ఎడిటింగ్ ప్లస్ రిపేర్లు చేసే అవకాశం ఉందంటున్నారు.

నిజానికి నాగ్ జడ్జ్ మెంట్ లు ఈ మధ్య అంతగా ఫలితాలను ఇవ్వడం లేదు. తనే స్వంతంగా నిర్మించి అఖిల్ కు రీ లాంచింగ్ రేంజ్ లో పదే పదే చెప్పుకున్న హలో రిజల్ట్ ఏమైందో తెలిసిందేగా. అందుకే దేవదాస్ విషయంలో అలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్త పడినట్టు సమాచారం. పైగా నిర్మాత అశ్వినిదత్ కు నాగ్ మంచి ఆప్తుడు. కింగ్ ఏది చెప్పినా దత్ కాదనరు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఆఖరి పోరాటం-గోవిందా గోవిందా-రావోయి చందమామ-ఆజాద్ లాంటి సినిమాలు వచ్చాయి. చిరంజీవి తర్వాత అశ్వినిదత్ ఎక్కువ సినిమాలు తీసింది నాగార్జునతోనే. అందుకే నాగ్ సైతం దేవదాస్ ని తన స్వంత సినిమాలాగా భావించడంలో ఆశ్చర్యం లేదు. నాని డాక్టర్ గా నాగ్ డాన్ గా నటిస్తున్న ఈ మూవీకి రష్మిక మందన్న మరో ప్రధాన ఆకర్షణగా మారింది. మణిశర్మ చాలా కాలం తర్వాత స్టార్ హీరో సినిమాకు పూర్తి స్థాయి సంగీతం అందిస్తున్నారు. ఏఎన్ ఆర్ గారి ఎవర్ గ్రీన్ టైటిల్ తో వస్తున్న మూవీ కాబట్టి దాని పేరు చెడగొట్టకుండా నాగ్ ఈ మాత్రం కేర్ తీసుకోవడం మంచిదే.