ఆ సినిమా కోసం నమ్రత-ఉపాసన ప్రమోషన్స్

0సినిమా ఇండస్ట్రీలో రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రయోగాలు చేసే వారి చాలు తక్కువ మంది ఉంటారు. ముఖ్యంగా మన టాలీవుడ్ లో అయితే ఆ సంఖ్య ఇంకా తక్కువ. అలాంటి వారిలో మంచు వారి కూతురు ఉన్నారని ఒప్పుకోవాల్సిందే. ఎవరి మీద ఆధారపడకుండా తన సొంతంగా సినిమాలను నిర్మించుకుంటూ నటనలో కూడా రాణిస్తూ వస్తున్నారు. గత కొన్నేళ్లుగా లక్ష్మి చేసిన ప్రయోగాలు చాలానే ఉన్నాయి.

ఇక ఈ సారి ఒక భార్య పాత్రలో కనిపిస్తూ వైఫ్ ఆఫ్ రామ్ అనే సినిమాతో రానున్నారు. సొంతంగా నిర్మించుకున్న ఈ సినిమాకు విజయ్ యేలకంటి దర్శకత్వం వహించాడు. ఈ నవ దర్శకుడు ఇంతకుముందు బాహుబలి వంటి సినిమాకు గ్రాఫిక్స్ టీమ్ తో కలిసి పనిచేశాడు. మంచు లక్ష్మి ఇచ్చిన అవకాశంతో మనోడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇకపోతే ఈ సినిమాకు లక్ష్మి ప్రమోషన్స్ ను గట్టిగా ప్లాన్ చేస్తోంది.

ట్రైలర్ లాంచ్ కు శిల్పా రెడ్డి.. రకుల్ ప్రీత్.. స్వప్న దత్ లు అతిథులుగా రాగా.. ఈ సినిమా కోసం జరిగే ఇతర ప్రమోషన్ కార్యక్రమాల కోసం త్వరలోనే నమ్రత అండ్ ఉపాసన్ జాయిన్ అవ్వనున్నారట. అలాగే నారా బ్రాహ్మణి కూడా సినిమాను ప్రమోట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే వైఫ్ ఆఫ్ రామ్ సినిమా ఒట్టావా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రత్యేక ప్రదర్శనకు అవకాశం లభించింది. ఈ విషయాన్ని అందరికి తెలిసేలా లక్ష్మి ప్రమోషన్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా జనాలను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.