‘ఎన్టీఆర్’ లో బొబ్బిలిపులి గాండ్రింపు…!

0

సీనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో ఎప్పటికి నిలిచి పోయే చిత్రం ‘బొబ్బిలిపులి’. దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో ఎన్టీఆర్ లుక్ మరియు నటన ఏ ఒక్కరు మర్చి పోలేరు. ముఖ్యంగా ‘బొబ్బిలిపులి’ చిత్రంలో క్లైమాక్స్ లో కోర్టు సీన్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. న్యాయ వ్యవస్థను ప్రశ్నించే వ్యక్తిగా ఎన్టీఆర్ కనిపించారు. అద్బుతమైన ఆ పాత్రను ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో కూడా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ సినీ కెరీర్ గురించి చూపించినప్పుడు ఆ కోర్టు సీన్ చూపించకుంటే ఆ బయోపిక్ అసంపూర్ణమే. అందుకే క్రిష్ ‘ఎన్టీఆర్’ లో బొబ్బిలిపులి క్లైమాక్స్ ను చూపించబోతున్నాడట.

‘బొబ్బిలిపులి’ సీన్ కోసం బాలకృష్ణ చాలా ప్రత్యేకంగా మేకప్ అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది. అచ్చు గుద్దినట్లుగా ఎన్టీఆర్ ను దించేయాలనే ఉద్దేశ్యంతో బొబ్బిలిపులి ఎన్టీఆర్ లుక్ ను అనేక విధాలుగా అనేక యాంగిల్స్ లో చూసి బాలయ్యను మేకప్ చేస్తున్నారట. త్వరలోనే బాలయ్య బొబ్బిలిపులి లుక్ రాబోతుంది. బొబ్బిలిపులి చిత్రంలో ఎన్టీఆర్ గాండ్రిరచినట్లుగా ‘ఎన్టీఆర్’ చిత్రంలో బాలయ్య కూడా తనదైన శైలి డైలాగ్స్ తో గాండ్రిరచేందుకు సిద్దం అవుతున్నాడు.

ఎన్టీఆర్ సినీ కెరీర్ లో ఎన్నో మరపురాని పాత్రలు చేశారు. అందులో కొన్ని అత్యంత కీలకమైన పాత్రలను ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో చూపిస్తున్నాడు క్రిష్. రోజు రోజుకు అంచనాలు పెరిగి పోతున్న ‘ఎన్టీఆర్’ మూవీ రెండు పార్ట్ లుగా రాబోతున్న విషయం తెల్సిందే. మొదటి పార్ట్ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సంక్రాంతికి రెండవ పార్ట్ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ రిపబ్లిక్ డే కు రాబోతుంది. ఈ రెండు సినిమాలు కూడా బాలయ్య కెరీర్ లోనే అత్యధిక మొత్తాలను రాబట్టడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.
Please Read Disclaimer