వాళ్ల ముందే బాలయ్య తొడగొట్టాడుగా!

0ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏం చేసినా అందులో కొత్త దనం ఉంటుంది! అది కత్తి తిప్పడంలో కావొచ్చు.. విలన్లతో డైలాగులు చెప్పడంలో కావొచ్చు..యాక్షన్ సన్నివేశాల్లోనూ ఇది స్పష్టంగా కనిపిస్తుంది! తెలుగే కాక ఇతర భాషల్లో జరుగుతున్న సినిమా ఈవెంట్లకు బాలయ్య అటెండ్ అవ్వడం.. అక్కడ అభిమానులను అలరించేలా డైలాగులు చెప్పడం చూస్తూనే ఉంటాం. ఇందుకు భిన్నంగా లైవ్ లోనే స్టేజ్ పై బాలయ్య చేసిన యాక్షన్ సన్నివేశం ఇప్పుడు నెట్లో హల్ చల్ చేస్తోంది! వివిధ సినీ పరిశ్రమలకు చెందిన దిగ్గజ నటులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో బాలయ్య లైవ్ యాక్షన్ కే కాదు.. ఆయన తొడ కూడా కొట్టి అక్కడుతన్న వాళ్లంతా అవాక్కయ్యేలా చేశారు.

ఇటీవల చెన్నైలో జరిగిన స్టంట్ ఆర్టిస్ట్స్ యూనియన్ 50వ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్యను స్టేజీపైకి ఆహ్వానించారు వ్యాఖ్యాతలు! స్టేజ్ పైకి బాలయ్య వెళ్లగానే – ‘స్టేజ్ పై ఓ స్టంట్ చేసి చూపిస్తారా?’ అని వ్యాఖ్యాత అడిగారు. అందుకు ఎంతో ఉత్సాహంతో బాలయ్య `సరే` అన్నారు. వెంటనే నలుగురు స్టంట్ ఆర్టిస్టులు స్టేజీ పైకి వచ్చారు. వాళ్లతో సినిమాలో చేసినట్టుగానే చేసి.. అందరినీ అబ్బురపరిచాడు.

అంతేగాక చివరిలో తొడకొట్టి అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేశాడు. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న దిగ్గజ నటులు రజనీకాంత్ – మోహన్ లాల్ తో పాటు ఇతర తమిళ నటులు సూర్య – మాధవన్ సహా బాలయ్య ఫైట్ ను – ఆయన తొడగొట్టడాన్ని ఆసక్తిగా గమనించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. వయసు తగ్గుతున్నా బాలయ్యలో ఎనర్జీ మాత్రం ఏరేంజ్లో ఉందో అర్థంచేసుకోవచ్చు మరి!!