ఆ మాటలు నందిత శ్వేతను బాధపెట్టాయట

0

సెలబ్రెటీలను జనాలు ఎంతగా నెత్తికి ఎత్తుకుంటారో కొన్ని సార్లు అదే స్థాయిలో ట్రోల్స్ చేయడం కూడా చేస్తారు. సోషల్ మీడియా పరిధి పెరిగినప్పటి నుండి సెలబ్రెటీలపై ట్రోల్స్ విపరీతంగా పెరిగి పోయాయి. ఒక్కరు మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తే.. ఇద్దరు ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా నెటిజన్స్ ట్రోల్స్ కు హీరోయిన్ నందిత శ్వేత బాధపడిందట. ఈ విషయాన్ని తాజాగా ఈమె స్వయంగా వెళ్లడించింది. తన గురించి సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ విని బాధేస్తుందంది.

ఎక్కువగా సినిమాల్లో నువ్వు ఎందుకు కనిపించడం లేదు.. నీకు సినిమా అవకాశాలు తగ్గి పోయాయా.. నన్ను ఒక ఔట్ డేటెడ్ నటి అన్నట్లుగా విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలు నాకు ఆవేదన కలిగిస్తున్నాయి. సినిమాలు చేయక పోతే మరేం చేయనట్లుగా జనాలు ఎలా భావిస్తున్నారు. అసలు ఇలాంటి కామెంట్స్ అవతలి వారిని ఎంతగా బాధ పెడతాయో వీరికి అర్ధం కాదా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రస్తుతం జనాలు స్టార్స్ తో కలిసి నటిస్తేనే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నట్లని.. కమర్షియల్ సినిమాలతో సక్సెస్ దక్కించుకుంటేనే సక్సెస్ అయినట్లుగా ప్రస్తుతం ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. వారు ఆ విధంగా ఆలోచించడంతో పాటు హీరోయిన్స్ పై ట్రోల్స్ చేయడం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పలు హర్రర్ సినిమాల్లో నటించడంతో పాటు కొన్ని చిన్న చిత్రాల్లో కూడా నటించిన నందిత శ్వేత త్వరలో ఒక స్టార్ హీరోకు జోడీగా నటించబోతున్నట్లుగా పేర్కొంది. నటిగా కాస్త గ్యాప్ తీసుకుంటున్న ఆమె త్వరలోనే ఫుల్ స్వింగ్ తో రీ ఎంట్రీ ఇవ్వనుందేమో చూడాలి.
Please Read Disclaimer