నాని హ్యాట్రిక్ కొట్టబోతున్నాడా! ?

0jenda-pi-kapiraju2013లో ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు అనే బాధను 2014 మొదట్లోనే మూడు సినిమాలు విడుదల చేసి పోగొట్టుకుందాం అనుకున్నాడు నాని. అయితే ఒక్క సినిమా కూడా విడుదల కాని 2013 బెస్ట్‌ అని, 2014 పీడకలల మిగిలిందని నాని బాధ పడుతున్నాడు. ఈ హీరో నటించిన ‘పైసా’, ‘ఆహా! కళ్యాణం’ చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకు ముందుకు వచ్చాయి, పోయాయి. త్వరలో మరో చిత్రం ‘జెండాపై కపిరాజు’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం ఎలా ఉండబోతుంది అనేది ముందే తెలిసిపోయింది. ఈ చిత్రం కూడా నానికి ఫ్లాప్‌ ఇవ్వబోతుంది అని తేలిపోయింది.

సముద్ర ఖని దర్శకత్వంలో తెరకెక్కిన ‘జెండాపై కపిరాజు’ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా జయం రవి హీరోగా తెరకెక్కింది. తమిళంలో ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. అక్కడ ఘోర పరాజయం పాలైంది. సముద్ర ఖని కెరీర్‌లోనే పెద్ద ఫ్లాప్‌గా ఈ చిత్రం నిలిచింది. దాంతో ఇక్కడ కూడా ఫ్లాప్‌ గ్యారెంటీ అని, నాని హ్యాటిక్‌కు సిద్దంగా ఉన్నాడు అని ప్రచారం జరుగుతోంది. కేవలం నెల వ్యవధిలో మూడు ఫ్లాప్‌లు రావడంతో నాని దిగులు చెందుతున్నాడు. ఈయన తర్వాత సినిమా ఏంటి అనేది ఇంకా తేలాల్సి ఉంది.