నాని నిర్మాణంలో మరో దర్శకుడు

0అ’ చిత్రానికి నిర్మాతగా మారాడు నాని. ఆయన తన సొంత సంస్థ వాల్‌ పోస్టర్‌ సినిమా పతాకంపై ‘అ!’ అనే సినిమాను నిర్మించి హిట్ కొట్టాడు. ఈ సినిమా కి మంచి ప్రసంసలు కూడా దక్కాయి. ఇప్పుడు మరో దర్శకుడిని పరిచయం చేయబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా నానినే వెల్లడించాడు.

”మా సంస్థ నుంచి మరో కొత్త దర్శకుడిని పరిచయం చేయబోతున్నా. నేను నిర్మాణ సంస్థని ప్రారంభించిందే అందుకు. కొన్నేళ్ల తర్వాత వాల్‌ పోస్టర్‌ సినిమా సంస్థ పరిశ్రమకి మంచి దర్శకుల్ని అందించిందని పదిమంది చెప్పుకోవాలి. నా సంస్థలో నేనే హీరోగా సినిమాలు చేసుకొంటే చాలా లాభాలుంటాయి. కానీ నా సినిమాలు నేను చేసుకోను. ‘అ’ సినిమాకి మంచి స్పందన వచ్చింది. ‘అ!’ లాంటి సినిమా తీసినందుకు నిర్మాతగా గర్వపడుతున్నా” అని చెప్పుకొచ్చాడు నాని.