హీరోయిన్ ని పెళ్లి చేసుకోమన్న నాని

0


అల్లు అర్జున్ మూవీలో విలన్ గా చేసి ఆది పినిశెట్టి యంగ్ విలన్ గా విపరీతంగా ఆకట్టుకున్నాడు. హీరోగా మెప్పిస్తూనే మరోవైపు.. విలన్ గా తన ట్యాలెంట్ చూపించిన ఆది.. ఇప్పుడు మరకతమణి అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ ఆడియో ఫంక్షన్ జరగగా.. ఈ కార్యక్రమానికి హాజరైన నాని బెస్ట్ విషెస్ తో పాటు బోలెడన్ని కబుర్లు చెప్పాడు.

‘ఈ తరం యంగ్ హీరోస్ ఎవరిలోనూ కనిపించని ఓ గొప్ప లక్షణం ఆదిలో ఉంది. ఎవరైనా కాసింత దగ్గరైతే.. వారితో తన పేరెంట్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాడు. ఇలాంటి యాటిట్యూడ్ నేను వేరే ఏ యాక్టర్ దగ్గర చూడలేదు. ఆది అంత మంచి మనసు కల వ్యక్తి. పేరెంట్స్ అంటే అంత ఇష్టం.’ అన్న నాని.. పేరెంట్స్ తో మాట్లాడేందుకు పక్కకు వెళ్లిపోయేవాడని.. ఫోన్ తీసుకుని పక్కకు వెళ్లడం జరిగిందని అన్నాడు. నిజంగా పేరెంట్స్ తోనే మాట్లాడాడో లేదో మాత్రం తనకు తెలీదని నవ్వులు పేల్చాడు. ‘ఆది పెళ్లి అంటూ ఈ మధ్య తెగ వార్తలు వస్తున్నాయి. తనని చేసుకోవచ్చు కదా. బాగుంది కదా’ అంటూ హీరోయిన్ వంక చూపిస్తూ ఆదికి సలహా ఇచ్చాడు నాని.

మరకతమణి పెద్ద హిట్ అయిపోవాలని కోరుకుంటున్నానని.. నిన్ను కోరి చిత్రంలో ఆది -నివేదా థామస్ లతో పాటు నాని కూడా ఓ కేరక్టర్ చేశాడని చెప్పుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. హీరో సినిమా అని కాకుండా.. డైరెక్టర్ మూవీ అనే కాన్సెప్ట్ ఉండాలని దర్శకరత్న దాసరి నారాయణ రావు గారి కల అని.. అందుకోసమే తాను కష్టపడతానని చెప్పి.. అందరినీ ఆకట్టుకున్నాడు నాని.