ఇక ఆశలన్నీ జెండాపైనే !

0nani-JPKనానికి ఫిబ్రవరి కలసి రాలేదు. గత ఏడాది ఒక్క సినిమాని కూడా థియేటర్లోకి తీసుకురాలేక పోయిన నాని, 2014 ఆరంభంలోనే మూడు సినిమాలు రెడీ చేశాడు. ఈ ఫిబ్రవరిలో రెండు సినిమాలు థియేటర్లోకి వచ్చాయి. కృష్ణ వంశి ‘పైసా’, బాలీవుడ్ రిమేక్ ‘ఆహా కల్యాణం’. ఈ రెండు చిత్రాల ఫలితాలు నానికి నిరాశ పరిచాయి. పైసా లో కృష్ణ వంశి మార్క్ మిస్ అయ్యింది. దీంతో పాటు గతంలో ఆయన తీసిన ‘డేంజర్’ చిత్రాన్ని పోలి ఉండటంతో ప్రేక్షకుడు అంతగా కనెక్ట్ అవ్వలేదు. ఇక ఆహా కల్యాణం విషయానికి వస్తే..నందిని రెడ్డి ‘జబర్దస్త్’ కు ఈ కళ్యాణానికి పెద్ద తేడాలేదు. అన్ని రిపీటేడ్ సీన్లు. దీంతో ‘ఆహా కళ్యాణం’ కొత్త సినిమా అన్న ఫీలింగే పోయింది. ఇక మిగిలింది ‘జెండాపై కపిరాజు ‘ . నాని ఆశలన్నీ ‘జెండాపై కపిరాజు’ పైనే వున్నాయి. తొలిసారి ఈ చిత్రంలో డబుల్ రోల్ చేస్తున్నాడు. మరి ఈ చిత్రంతోనైనా నాని సక్సెస్ జెండా ఎగురుతుందో లేదో చూడాలి. ఎగరలేనే ఆశిద్దాం.!