నాని ముందుంది సవాళ్ల పండగ

0Nani-Bigg-Boss-2న్యాచురల్ స్టార్ నాని బిగ్ బాస్ 2 కోసం యాంకర్ గా జూనియర్ ఎన్టీఆర్ నుంచి పగ్గాలు తీసుకోవడం ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేపుతోంది. టీవీ ఎక్కువగా చూసే ఫామిలీ ఆడియన్స్ లో బలమైన ఇమేజ్ ఉన్న నాని షోని ఇంకో లెవెల్ కు తీసుకెళతాడు అనే అంచనాలు నిర్వాహకుల్లో కూడా భారీగా ఉన్నాయి. అందుకే దీని తాలూకు టీజర్లలో ఇంకొంచెం మసాలా అంటూ రాబోయే సీజన్ లో వివాదాలు ఉండవచ్చు అని చెప్పకనే చెబుతున్నట్టు ఉంది. స్టార్ మా టీమ్ సైతం నాని తన సహజమైన బాడీ లాంగ్వేజ్ నే ఉపయోగించేలా డిజైన్ చేసినట్టు తెలిసింది. ఒకరకంగా నానికి మాస్ లో మంచి ఇమేజ్ తెచ్చిన నేను లోకల్ ఫ్లేవర్ ఉండేలా చూస్తున్నారట. మరీ ప్రొఫెషనల్ గా ఉండకుండా జోవియల్ గా పార్టీసిపెంట్స్ తో సరదాగా కలిసిపోతూ ఉండేలా సెట్ చేస్తున్నారట. తారక్ తో పోలిక వస్తుంది కాబట్టి నాని కూడా ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటి సీజన్ ను జూనియర్ నడిపించిన తీరు ఇంకా ప్రేక్షకుల మనసులో చెరిగిపోలేదు. దాన్ని మరిపించడం అంత ఈజీ టాస్క్ కాదు.

పైగా ఈ రియాలిటీ షోలు ఒకరు నడిపిన తరువాత వేరొకరు తీసుకునేటప్పుడు బాధ్యత కన్నా బరువు ఎక్కువగా ఉంటుంది. కౌన్ బనేగా కరోడ్పతి అమితాబ్ నుంచి షారుఖ్ ఖాన్ పగ్గాలు తీసుకున్నప్పుడు ఆ రేంజ్ లో మెప్పించలేకపోయాడు. మీలో ఎవరు కోటీశ్వరుడు టైంలో చిరు పరిస్థితి కూడా ఇంచుమించు ఇంతే. అందుకే నానికి అలంటి సమస్య రాకుండా మొత్తం షో ఫార్మాట్ లోనే చాలా మార్పులు జరిగినట్టు తెలిసింది. పైగా లీక్స్ రూపంలో వచ్చిన సెలబ్రిటీ లిస్ట్ చూస్తే ఇదేదో మామూలు రచ్చలా కనిపించడం లేదు. దానికి తోడు చాలా బడ్జెట్ కేటాయించి పూణేలో కాకుండా ఈసారి షో మొత్తం హైదరాబాద్ లోనే ప్రత్యేకంగా సెట్ వేసి మరీ తీస్తున్నారు. సో టిఆర్పి రేటింగ్స్ ని నాని ఎలా ప్రభావితం చేయబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సవాళ్లు అన్ని దాటుకుంటే నాని బిగ్ బాస్ కంటే తాను విన్నర్ గా నిలుస్తాడు. నాని ఎంట్రీ తో ఫాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా బిగ్ బాస్ పై ఆసక్తి మొదలైంది కాబట్టి హంగామా ఎలా ఉండబోతోందో వేచి చూడాలి .