ప్రియాంకతో నాని రొమాన్స్.. నిజమేనా?

0




Nani-and-Priyankaనాని చేసే నేచురల్ యాక్టింగ్ కు టాలీవుడ్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టేస్తున్నారు. ఈ నేచురల్ స్టార్ నటించిన ఆర్డినరీ మూవీస్ కూడా ఎక్స్ ట్రార్డినరీ టైపులో హిట్ అయిపోతున్నాయి. ప్రస్తుతం నేను లోకల్ మూవీని ఫినిష్ చేస్తున్న నాని.. ఈ ఏడాది ముగిసేలోపే దీన్ని రిలీజ్ చేసేయనున్నాడు కూడా. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కు బోలెడన్ని ప్రశంసలు రావడమే కాదు.. మూవీపై అంచనాలు కూడా పెంచేసింది.

అయితే.. కొన్ని రోజులుగా నాని ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఒకదానిపై వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వరుసగా పలు భాషల్లో సినిమాలు ప్రొడ్యూస్ చేద్దాం అని డిసైడన సెక్సీ బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. తెలుగులో తను నిర్మించనున్న మూవీకి నానిని హీరోగా తీసుకున్నట్లు న్యూస్ వచ్చింది. ప్రియాంకతో నాని అనగానే ఆశలతో పాటు అంచనాలు కూడా పెరిగాయి. ఇప్పుడీ మూవీపై పెదవి విప్పాడు నాని. అసలు తనను అలాంటి ప్రాజెక్టు కోసం ఎవరూ సంప్రదించలేదని.. ఇదంతా రూమర్ అని తేల్చేశాడు.

స్వయంగా నానినే ప్రియాంకతో మూవీ విషయాన్ని ఖండించడంతో ఓ క్లారిటీ వచ్చేసినట్లే. అయితే.. బాలీవుడ్ జనాలకు నానిపై నమ్మకాలు ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో అయినా ఇది నిజం కావచ్చు. గతంలో ఆహా కళ్యాణం మూవీ కోసం యష్ రాజ్ ఫిలిమ్స్ తో జోడీ కట్టాడు. చూద్దాం మరి.. మరో బాలీవుడ్ ప్రొడ్యూసర్ తో తన తదుపరి వెంచర్ ఎప్పుడు చేస్తాడో.