నానికి నెర్వస్ కలిగించిన బుడ్డోడు

0నేచురల్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న నాని ఎలాంటి పాత్రలను అయినా చాలా సహయంగా పోషించగలడు అనే పేరు ఉంది. తనకు ఇచ్చిన ప్రతి పాత్రలో ఇన్వాల్వ్ అయ్యి మరీ నటించడం వల్లే నానికి సహజ నటుడు అనే పేరు వచ్చింది. నాని మొదటి చిత్రం ‘అష్టా చమ్మా’ విడుదలై 10 ఏళ్లు పూర్తి చేసుకున్న విషయం తెల్సిందే. ఈ సందర్బంగా నాని అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈ సందర్బంగా నాని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఒక ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సినిమా ఇండస్ట్రీలో పది సంవత్సరాలుగా కొనసాగుతున్నాను – కాని ఎప్పుడు కూడా నటించే సమయంలో నెర్వస్ ఫీల్ అనిపించలేదు. కాని జున్ను దేవదాసు సెట్స్ కు వచ్చిన సమయంలో డాక్టర్ దాసుగా నటించేందుకు నెర్వస్ అయ్యాను అంటూ ఫొటోతో పాటు ఫన్నీగా కామెంట్ పెట్టాడు. తన కొడుకు ముందు నటించేందుకు ఇబ్బంది పడ్డాను అంటూ నాని చేసిన పోస్ట్ అందరి దృష్టి ఆకర్షిస్తోంది. నాని మరియు జున్ను ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

‘దేవదాసు’ చిత్రంను పూర్తి చేసే పనిలో ఉన్న నాని త్వరలోనే మరో సినిమాను కూడా పూర్తి చేయబోతున్నాడు. ఇదే సమయంలో తెలుగు బిగ్ బాస్ కు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. ‘దేవదాసు’ చిత్రం ఈనెల చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా – మరో చిత్రాన్ని కూడా ఇదే సంవత్సరం చివర్లో విడుదల చేసేలా నాని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.